ETV Bharat / state

ముక్కోటి ఏకాదశితో రాష్ట్రవ్యాప్తంగా కిక్కిరిసిన ఆలయాలు - వేకువజాము నుంచే బారులు తీరిన భక్తులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 23, 2023, 10:02 PM IST

Vaikunta_Ekadasi_at_TTD_2023
Vaikunta_Ekadasi_at_TTD_2023

Vaikunta Ekadasi at TTD 2023 : వైకుంఠ ఏకాదశి వేళ రాష్ట్రవ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. ఆలయాల్లో ఉత్తర ద్వారం మీదుగా వెళ్లి విష్ణుమూర్తిని దర్శిస్తే పుణ్యమని పురాణలు చెబుతున్నాయి. దైవదర్శనం కోసం వేకువజాము నుంచే ఆలయాల వద్ద భక్తులు బారులు తీరారు. తిరుమల సహా ఆలయాలన్నీ గోవింద నామస్మరణతో మార్మోగాయి.

Vaikunta Ekadasi at TTD 2023 : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. వైకుంఠ ద్వారం తెరిచి తెల్లవారుజామునుంచే పూజా కైంకర్యాలు నిర్వహించారు. ఆలయాన్నిరకరకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దాదాపు మూడున్నర గంటల పాటు తి.తి.దే ప్రముఖులకు దర్శనం కల్పించింది. నిర్దేశించిన సమయం కన్నా 45 నిమిషాల ముందే సర్వ దర్శనం, 300 రూపాయల ప్రత్యేక దర్శనాలకు భక్తులను ఆలయంలోకి టీటీడీ అనుమతించింది.

శోభాయమానంగా వెలిగిపోతున్న వైష్ణవాలయాలు - మిన్నంటిన ముక్కోటి ఏకాదశి వైభవం

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైల మహా క్షేత్రంలో ముక్కోటి ఏకాదశి మహోత్సవం వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను శోభాయమానంగా అలంకరించి ఉత్తర ద్వారం ముఖంగా కొలువుదీర్చారు. మంగళ వాయిద్యాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ ఉత్తర ద్వారాలు తెరిచి ఉత్సవమూర్తులను వెలుపలకు తీసుకు రాగా స్వామి అమ్మవార్ల దివ్యమంగళ వైభవాన్ని భక్తులు దర్శించుకున్నారు.

వైకుంఠ ఏకాదశికి తిరుపతి వెళ్తున్నారా? ఈ విషయం తెలుసుకోండి - మిస్​ అయితే అంతే!

Uttara Dwara Darshanam at TTD : విశాఖలోని సింహాద్రి అప్పన్నదర్శనానికి భక్తులు పోటెత్తారు. కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవునిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలోని శ్రీ భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులతో కిక్కరిసింది. శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణ స్వామి వారి ఆలయం కిటకిటలాడింది. కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. వైఎస్సార్ జిల్లాలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో నిండిపోయింది.

రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం.. పోటెత్తిన భక్తజనం

Mukkoti Ekadasi in AP : మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్తర ద్వార దర్శనానికి జనం భారీగా తరలివచ్చారు. బాపట్ల జిల్లా అద్దంకి శ్రీ భూనీల సమేత రంగనాయకుల స్వామి ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. అనంతపురంలో వెంకటేశ్వర స్వామి వారి ఆలయం గోవింద నామస్మరణతో మార్మోగింది. రెండో శ్రీరంగంగా పేరొందిన నెల్లూరు తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసి పోయింది.

వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏంటీ.. పురాణాలు ఏం చెబుతున్నాయి..?

కాకినాడ జిల్లాలో అన్నవరం సత్యనారాయణ స్వామి వారు అలంకరణ వైభవంతో భక్తులకు దర్శనిమిచ్చారు. విజయనగరం జిల్లాలో పలు పలుప్రాంతాల్లో వెలిసిన స్వామి వారి ఆలయంలో భక్తులు ముక్కోటి ఏకాదశి పూజలు ఘనంగా నిర్వహించారు. కోనసీమ జిల్లాలో వివిధ ప్రాంతాల్లో స్వామి ఆయాల్లో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా , ఉండ్రాజవరంలో శ్రీ భూ సమేత వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఏకాదశి పర్వదినాన ఉత్తర ద్వారం వైపు ప్రవేశించి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ కావటంతో భక్తులు అధిక సంఖ్యలో చేరుకుని స్వామి వారిని దర్శనం చేసుకున్నారు.

ముక్కోటి ఏకాదశి ఎప్పుడు? - ఎలా పూజించాలి? - మీకు తెలుసా?

ముక్కోటి ఏకాదశితో రాష్ట్రవ్యాప్తంగా కిక్కిరిసిన ఆలయాలు - వేకువజాము నుంచే బారులు తీరిన భక్తులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.