'టీటీ దేవస్థానమ్స్​' యాప్​​.. సౌకర్యాల వివరాలివే..

author img

By

Published : Jan 27, 2023, 6:06 PM IST

Updated : Jan 28, 2023, 10:31 AM IST

TTDEVASTHANAMS APP

TTDEVASTHANAMS APP : భక్తులకు అన్ని విధాల సేవలను అందించేందుకు టీటీడీ కసరత్తులు చేస్తోంది. అందులో భాగంగానే శ్రీవారి భక్తులకు ప్రత్యేకమైన యాప్​ను అందుబాటులోకి తీసుకువచ్చింది. యాప్​లో అందుబాటులో ఉన్న సేవలను టీటీడీ ఛైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి వివరించారు.

TTD : తిరుమల శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు టీటీడీ సిద్ధమైంది. సులభమైన సేవలను అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం​ యాప్​ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రిలయన్స్​ సంస్థ రూపొందించిన ఈ యాప్​ను.. టీటీడీ ఛైర్మన్​ సుబ్బారెడ్డి అన్నమయ్య భవనంలో ప్రారంభించారు. ఈ యాప్​ ద్వారా తిరుమలలో నిర్వహించే ప్రతి కార్యక్రమం ప్రత్యక్షప్రసారం అవుతుందని తెలిపారు. భక్తులు నేరుగా ఈ యాప్​లో తిలకించవచ్చని అన్నారు.

ఎస్వీబీ​సీ భక్తి ఛానల్లో ప్రసారమయ్యే కార్యక్రమాలను సైతం ఇందులో అందుబాటులో ఉంటాయన్నారు. అంతేకాకుండా ఇదే యాప్​ను ఉపయోగించి.. భక్తులు దర్శన టికెట్లను, గదులను, ఆర్జిత సేవా టికెట్లను పొందవచ్చని తెలిపారు. వర్చువల్​ సేవలను కూడా ఈ యాప్​లో బుక్​ చేసుకోవచ్చని వివరించారు. శ్రీవారి ఆలయంలో స్వామివారికి జరిగే ప్రతి కార్యక్రమం.. గ్యాలరీలోని యాప్​లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. తిరుమల చరిత్ర కూడా ఈ గ్యాలరీలో ఉందని ఆయన వెల్లడించారు.

"శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలను అందించటానికి ప్రయోగాత్మకంగా 'టీటీదేవస్థానమ్స్​' అనే యాప్​ను అందుబాటులోకి తీసుకువచ్చాము. భక్తులు తిరుపతికి రావాలన్న.. ఏయే సేవలు అందుబాటులో ఉన్నాయో తెలుసుకోవాలన్న యాప్​లో ఉంటాయి. శ్రీవారి సేవ కార్యక్రమాలలో పాల్గొనాలన్న దానికి సంబంధించిన సమాచారం ఇందులో అందుబాటులో ఉంటుంది." -టీటీడీ ఛైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి

టీటీడీ ఛైర్మన్​ వైవీ సుబ్బారెడ్డి

ఇవీ చదవండి :

Last Updated :Jan 28, 2023, 10:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.