ETV Bharat / state

TTD Proposals Rejected by The AP Government: తితిదే ప్రతిపాదనను తిరస్కరించిన రాష్ట్ర ప్రభుత్వం..మెమో జారీ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 20, 2023, 10:53 PM IST

TTD_Proposals_Rejected_by_the_Government
TTD_Proposals_Rejected_by_the_Government

TTD Proposals Rejected by The AP Government: తితిదే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. తిరుపతి అభివృద్ధికి తితిదే బడ్జెట్‌లో ఒక శాతం నిధి కేటాయించాలన్న ప్రతిపాదనను తిరస్కరిస్తూ.. తితిదే ఈవోకు.. దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్‌ మెమో జారీ చేశారు.

TTD Proposals Rejected by The AP Government: తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) వార్షిక బడ్జెట్‌లో ప్రతిపాదించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించింది. తిరుపతి అభివృద్ధికి ఒక శాతం నిధి కేటాయించాలని తితిదే బడ్జెట్‌లో పేర్కొన్న ప్రతిపాదనను తిరస్కరిస్తూ.. దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్‌ తితిదే ఈవోకు మెమో జారీ చేశారు. ఈ క్రమంలో ధార్మిక సంస్థల నిరసనతోనే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని, ఇది భక్తుల విజయమని బీజేపీ నేత భానుప్రకాశ్‌ రెడ్డి పేర్కొన్నారు.

TTD Board of Trustees Meeting: అక్టోబర్ 10వ తేదీన తిరుమల అన్నమయ్య భవన్‌లో తితిదే ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ధర్మకర్తల మండలి తీసుకున్న నిర్ణయాలను ఛైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి వెల్లడించారు. అందులో ప్రధానంగా.. ''తిరుపతి అభివృద్ధి కోసం తితిదే బడ్జెట్‌లో ఏటా ఒక శాతం నిధులను ఖర్చు చేసేందుకు నిర్ణయం. గోగర్భం డ్యాం వైపున ఓఆర్‌ఆర్‌లో రూ.18 కోట్లతో శాశ్వత ప్రాతిపదికన క్యూలైన్లతోపాటు ఆహార కేంద్రాలు, మరుగుదొడ్లు, నారాయణగిరి విశ్రాంతిగృహం, ఆళ్వార్‌ ట్యాంకు రోడ్డు సర్కిల్‌ వద్ద రెండు ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిల నిర్మాణం. తితిదే ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌కు పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదన. భక్తులకు తక్కువ ధరకు నాణ్యమైన భోజనం అందించేందుకు రూ.2.93 కోట్లతో నారాయణగిరి క్యాంటీన్‌లో మూడో అంతస్తు నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు టెండర్ల ఆమోదం.'' వంటి ప్రతిపాదనలతోపాటు మరికొన్ని కీలక ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించారు.

TTD Trust Board Meeting Decisions : తిరుపతి అభివృద్ధికి టీటీడీ నిధులు.. ధర్మకర్తల మండలి నిర్ణయం

Government Issued Memo to TTD EO: ఈ నేపథ్యంలో తితిదే పంపిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరిస్తున్నట్లు దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వలెవన్ ఓ మెమో జారీ చేశారు. ఆ మెమోలో.. తిరుపతి అభివృద్ధికి తితిదే బడ్జెట్‌లో ఒక శాతం నిధి కేటాయించాలన్న ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు తితిదే ధర్మకర్తల మండలి తీర్మానంపై రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ధార్మిక సంఘాలు నిరసనలు చేపట్టాయి. తితిదే ప్రతిపాదనను వెనక్కు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు హోరెత్తాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తితిదే ప్రతిపాదనలను తిరస్కరిస్తూ.. ఈవోకు మెమో జారీ చేసింది.

Misappropriation of TTD Funds: సొమ్మొకరిది సోకొకరిది అన్నట్లుగా టీటీడీ నిర్ణయాలు.. రాజకీయ లబ్ధి కోసం దేవుడి సొమ్ము దుర్వినియోగం

BJP Leader Bhanuprakash Reddy React: తితిదే ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తిరస్కరించటంపై.. బీజేపీ నేత భానుప్రకాశ్‌ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. తితిదే ధర్మకర్తల మండలి తీర్మానంపై ధార్మిక సంస్థల చేసిన నిరసనలు ఫలించాయన్నారు. ధార్మిక సంస్థల నిరసనతో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. ప్రభుత్వ వెనుకడుగు వేయడం.. భక్తుల విజయమని ఆయన అభివర్ణించారు.

TTD Distribute Sticks to Devotees: కర్రలొచ్చాయి... తిరుమల కాలినడక భక్తులకు పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.