ETV Bharat / state

మినిస్టర్​ రోజా మీ శాఖ మీకు గుర్తుందా - మంత్రిగా కాకపోయినా ఓ నేతగానైనా?!

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 26, 2023, 3:16 PM IST

tourism_minister_rk_roja_neglected_her_ministry
tourism_minister_rk_roja_neglected_her_ministry

Tourism Minister RK Roja Neglected Her Ministry: వైఎస్సార్​సీపీ మహిళా మంత్రుల్లో అనుచిత వ్యాఖ్యలతో రోజా అగ్రస్థానంలో నిలుస్తున్నారు. కానీ, ఆమెకు కేటాయించిన శాఖకు మాత్రం న్యాయం చేయలేకపోతున్నారు. మంత్రిగా కాకపోయిన ఓ నేతగానైనా కనీసం ఆమె ప్రతినిథ్యం వహిస్తున్న ప్రాంత అభివృద్ధినైనా పట్టించుకోలేకపోతున్నారు.

Tourism Minister RK Roja Neglected Her Ministry: అధికార వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీలో మంత్రి ఆర్‌కే రోజాకు ఉన్న ప్రత్యేక గుర్తింపు అందరికీ తెలిసిందే. అది మాత్రమే కాకుండా ఆమెకు తిరుపతితో ఉన్న అనుబంధం గురించి రాష్ట్ర ప్రజానీకానికంతటికీ తెలుసు. అలాంటి ఆమెకు పర్యాటకశాఖ మంత్రిగా అవకాశం దక్కడంతో, తిరుపతి పర్యాటక రంగంలో మరింత అభివృద్ధిని మూటగట్టుకుంటుందని స్థానిక జిల్లావాసులు ఆశించారు. కానీ, పర్యాటక శాఖ మంత్రి రోజా వారి ఆశలను ఆవిరి చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పర్యాటక శాఖ అభివృద్ధిపై రోజా వ్యాఖ్యలు: పర్యాటక శాఖ మంత్రి ఓ సారి తన శాఖపై స్పందిస్తూ, పర్యాటకులు ఉన్న చోటే పర్యాటక శాఖను అభివృద్ధి చేయాలని ఉచిత సలహాలిచ్చారు. పర్యాటక శాఖను పక్కనుంచితే, కనీసం సాధారణ అబివృద్ధినైనా మంత్రి పట్టించుకున్న దాఖలాలు లేవు. పలు పర్యాటక ప్రాజెక్టులను ముందుకు తీసుకేళ్లడం, రూపకల్పన చేయడం వంటివి ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. శ్రీకాళహస్తి, పలమనేరులోని అతిథిగృహాలతో పాటు, హార్సిలీహిల్స్‌, పులిగుండు, తలకోన, కుప్పం, పుత్తూరులలోని గెస్ట్​హౌస్​లు వసతి కల్పన లేక వెలవెలబోతున్నాయి. తలకోనను పర్యాటక కేంద్రంగా మార్చే ప్రణాళిక పడకేసింది. చంద్రగిరి కోట ఉందనే విషయాన్నే పూర్తిగా వదిలేశారు.

నగరి అసెంబ్లీ సీటు ఎవరికిచ్చినా నో ప్రాబ్లం - జగన్​ కోసం నా ప్రాణాలైనా ఇస్తా : మంత్రి రోజా

సంవత్సరాల తరబడి నిర్మాణం: పర్యాటకశాఖ బహుళ ప్రయోజనార్థం హరిత హోటల్‌ భవన సముదాయం నిర్మాణాన్ని చేపట్టారు. ఈ నిర్మాణ ప్రారంభ పనులను అలిపిరిలోని రుయా ఆసుపత్రి ఎదురుగా ఉన్న స్థలంలో 2013లో ప్రారంభించారు. అప్పుడు దీని అంచనా వ్యయం 17కోట్లుగా నిర్ణయించారు.

ఇందులో 110 గదులు, 200 మంది సామర్థ్యంతో హోటల్‌, అత్యాధునిక వసతులతో మీటింగ్​ హాల్​, పర్యాటక శాఖ డివిజన్‌ కార్యాలయం, కేంద్రీయ విచారణ కార్యాలయం ఇందులో ఉన్నాయి. ఈ నిర్మాణంపై ఇప్పటికే 11 కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. పెరిగిన అంచనాలను అనుసరించి మరో రూ.15 కోట్లు వెచ్చిస్తే అత్యాధునిక హంగులతో పర్యాటక శాఖకు భవనం ఉంటుంది. దీనివల్ల అద్దె నగదు భారం విముక్తితోపాటుగా, ఒక్క నెలకు 7 కోట్ల రూపాయలపైనా ఆదాయం లభిస్తుంది.

'ఆడుదాం ఆంధ్రా' క్రీడల్లో రాణించిన వారికి నగదు బహుమతులు

పరువు తీస్తున్న సొంత కార్యాలయం లేని ఘటన: తిరుపతి డివిజన్​ 1999 సంవత్సరంలో ఏర్పాటైంది. అయితే ఇప్పటి వరకు తిరుపతి డివిజన్​కు సొంత కార్యాలయం లేదు. శ్రీనివాసంలో 2003లో కొన్ని గదులు కేటాయించారు. అయితే 2011లో శ్రీనివాసంలో కేటాయించిన గదులను వెనక్కి తీసుకున్నారు. తిరుచారునులో నిర్మించిన పద్మావతి అతిథి భవనాన్ని 2019లో లీజు ప్రాతిపదికన అప్పగించారు. దాన్నీ కలెక్టరేట్​ కోసం తిరిగి ఖాళీ చేయించారు. అటు శ్రీదేవి కాంప్లెక్స్​లో నిర్వహించిన కేంద్రియ విచారణ కార్యాలయాన్ని సైతం ఖాళీ చేయాల్సి రావడంతో, ఇప్పుడు అలిపిరి మార్గంలోని రాష్ట్ర హెటల్​ మేనేజ్​మెంట్​ కళాశాలలో నిర్వహిస్తున్నారు.

మెండుగా ఆదాయం: తిరుపతి జిల్లాకు లక్షల మంది పర్యాటకులు వస్తున్నారని అంచనా. తిరుపతి డివిజన్​ విస్తరించిన ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సుమారు సంవత్సరానికి 8లక్షల మంది పర్యాటకులు వస్తున్నారని అంచనాలున్నాయి. ఈ క్రమంలో నెలకు 6 నుంచి 7 కోట్ల రూపాయలు ఆదాయం వస్తోందని, సంవత్సరానికి 70కోట్ల వరకు ఆదాయం వస్తోంది. పర్యాటక శాఖలో శాశ్వత ఉద్యోగులు లేరనే విమర్శలున్నాయి.

Minister RK Roja Dance in Shilparamam opening మంత్రి రోజా కోలాట నృత్యం.. గుంటూరులో శిల్పారామం ప్రారంభం

పర్యాటకులకు కొదవలేదు కానీ, నిర్లక్ష్యమే పాగా వేసింది: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పర్యాటనకు కొదవలేదు. జిల్లాలో తిరుపతి, హార్సిలీహిల్స్‌, శ్రీకాళహస్తి, కుప్పం, చంద్రగిరి కోట, కైలాసనాథ కోన, పులిగుండులాంటి పర్యాటక ప్రదేశాలున్నాయి. తిరుమల ఆలయాల దర్శన ప్యాకేజీలతోపాటు, జిల్లాలోని రిసార్టులు, కాటేజీలు, అద్దె గదులు, మీటింగ్​ హాల్స్​, ఇతర సదుపాయాల ద్వారా రాష్ట్రంలోనే అత్యధిక ఆదాయం వస్తోంది.

టీటీడీ దర్శనం ప్యాకేజీలతో సంవత్సరానికి 50 కోట్ల రూపాయల వరకు ఆదాయం వస్తోంది. శ్రీవారి దర్శనార్థం వస్తున్న భక్తులు వసతులు సరిగా లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్యాకేజీల నిర్వహణకు అవసరమైన బస్సుల కొరత వేధిస్తోంది. ప్రస్తుతం అత్యాధునిక వసతులు కలిగినవి 28 బస్సులు, ఇతర వాహనాలున్నాయి.

Janasena Leaders Fire on Minister Roja గన్​ కంటే జగన్ ముందే వస్తాడన్న రోజా.. భవ్యశ్రీ హత్యపై స్పందనెందుకు లేదు.. జనసేన నేతల ఘాటు వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.