ETV Bharat / state

తిరుపతిలో ఘనంగా ఓనం వేడుకలు.. ఆకట్టుకున్న సంస్కృతి సంప్రదాయాలు

author img

By

Published : Oct 30, 2022, 6:10 PM IST

Onam celebrated in Tirupati: తిరుపతిలో ఓనం వేడుకలు ఘనంగా జరిగాయి. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పండుగను సరిగా జరుపుకోని కేరళ వాసులు ఈ సంవత్సరం వైభవంగా జరుపుకున్నారు. ఆలిండియా మళయాళీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి.

Onam celebrated in Tirupati
ఓనం వేడుకలు

Allindia Malayali Association in Tirupati: విభిన్న సంస్కృతుల నిలయం..ప్రకృతి అందాలకు ఆలవాలమైన కేరళ రాష్ట్రం. తమదైన సంస్కృతీ సంప్రదాయాలతో పాటుగా వేషధారణలతో ఆకట్టుకునే కేరళీయులకు అతిపెద్ద పండుగ ఓనం. తిరుపతిలో స్ధిరపడ్డ కేరళవాసులు ఓనం పండుగను ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని బైరాగిపట్టెడలోని సీపీఐ ఫంక్షన్ హాల్ వేదికగా తిరుపతి కేరళ సమాజం, ఆలిండియా మళయాళీ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఓనం వేడుకలు కన్నుల పండువగా జరిగింది. కేరళకే ప్రత్యేకమైన సంస్కృతీ సంప్రదాయాలకు ఈ కార్యక్రమంలో వేదికగా నిలిచాయి.

ఓనం వేడుకలను తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, మేయర్‍ శిరిషా ప్రారంభించారు. పురాణాల ప్రకారం ఒకప్పుడు కేరళను స్వర్ణయుగంలా పరిపాలించిన బలిచక్రవర్తి.. తిరిగి తమను కలుసుకునేందుకు పాతాళం నుంచి తిరిగివచ్చిన రోజుగా ఓనం పండుగను భావించి సంబరంలా చేసుకుంటామని కేరళ వాసులు తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ పండుగను నిర్వహించుకుంటున్నామని,.. కరోనా అనంతరం ఓనం వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతిసారి ఓనం అయిన రెండు నెలల అనంతరం మళ్లీ ఆలిండియా మళయాళీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ పండుగను జరుపుకుంటామని తెలిపారు.

తిరుపతిలో ఘనంగా ఓనం వేడుకలు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.