ETV Bharat / state

ముగిసిన జాతీయ కార్మిక చట్టాల సమావేశాలు, వర్చువల్ గా హాజరైన సీఎం

author img

By

Published : Aug 27, 2022, 2:04 PM IST

కార్మిక చట్టాలపై తిరుపతిలో జరిగిన రెండు రోజుల సమావేశం ముగిసింది. ఈ సమావేశం రెండో రోజు కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ పాల్గోన్నారు. ముఖ్యమంత్రి వర్చువల్ గా ఈ సమావేశానికి హజరయ్యారు.

ముగిసిన కార్మిక చట్టాల సమావేశం
ముగిసిన కార్మిక చట్టాల సమావేశం

Meeting On Labour Acts:కార్మిక చట్టాలపై రెండు రోజుల పాటు తిరుపతిలో జరిగిన మేథోమధన సదస్సు ఇవాళ ముగిసింది. ముగింపు సమావేశంలో దేశంలోని కార్మికుల సమస్యల పరిష్కారం కోసమే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్‌ అన్నారు. ఈఎస్ఐ ఆస్పత్రుల్లో ఉన్న సమస్యల్ని పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ సమావేశం కార్మిక చట్టాల పటిష్టతకు మరింతగా ఉపయోగపడుతుందని ఆయన ఆకాంక్షించారు. ఏపీలో ఈ సదస్సు జరగడం ఆనందదాయకంగా ఉందన్నారు. దీనిని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఈ జాతీయ సదస్సుకి తిరుపతిని వేదికగా చేసిన కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ముగిసిన కార్మిక చట్టాల సమావేశం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.