ETV Bharat / state

Nara Lokesh Emotional Tweet on Bhuvaneshwari Nijam Gelavali Bus Yatra: అమ్మా.. తప్పక నిజం గెలుస్తుంది: నారా లోకేశ్ భావోద్వేగ ట్వీట్

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 25, 2023, 1:40 PM IST

Updated : Oct 26, 2023, 12:34 PM IST

Nara Lokesh Emotional Tweet on Bhuvaneshwari Nijam Gelavali Bus Yatra: నారా భువనేశ్వరి చేపట్టిన "నిజం గెలవాలి" బస్సు యాత్ర ప్రారంభమైన నేపథ్యంలో ఆమె తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ భావోద్వేగ పూరితమైన ట్వీట్ చేశారు. "అమ్మా..తప్పక నిజం గెలుస్తుంది.." అంటూ ట్వీటర్​(X) వేదికగా నారా లోకేశ్ స్పందించారు.

Nara_Lokesh_Emotional_Tweet_on_Bhuvaneshwari_Nijam_gelavali_Bus_Yatra
Nara_Lokesh_Emotional_Tweet_on_Bhuvaneshwari_Nijam_gelavali_Bus_Yatra

Nara Lokesh Emotional Tweet on Bhuvaneshwari Nijam Gelavali Bus Yatra : మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఏపీ స్కిల్ డెవలప్​మెంట్ కేసు (AP Skill Development Case)లో అరెస్టు కావడంతో తెలుగు తమ్ముళ్లు తల్లడిల్లిపోయారు. చంద్రబాబు అరెస్టు వార్తను జీర్ణించుకోలేని టీడీపీ కార్యకర్తలు, అభిమానులు మృతి చెందారు. వారి కుటుంబాలను పరామర్శించేందుకు బాబు సతీమణి నారా భువనేశ్వరి "నిజం గెలవాలి" పేరిట బస్సు యాత్రకు సిద్దం అయ్యారు. అందులో భాగంగా బుధవారం "నిజం గెలవాలి" పేరిట నారా భువనేశ్వరి బస్సు యాత్ర తిరుపతి జిల్లా చంద్రగిరి నుంచి ప్రారంభం అయ్యింది.

Nara Lokesh Latest Tweet : నారా భువనేశ్వరి "నిజం గెలవాలి" బస్సు యాత్ర మొదలైన సందర్భంగా ఆమె కుమారుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ భావోద్వేగ పూరితమైన ట్వీట్(X) చేశారు. "అమ్మా.. తప్పక నిజం గెలుస్తుంది.." అంటూ ట్వీటర్​(X) వేదికగా నారా లోకేశ్ స్పందించారు. ఈ పోస్టుకు ఆయన తల్లిదండ్రులు నారా చంద్రబాబు నాయుడు, భువనేశ్వరి కలిసి నడుస్తున్న ఫొటోను జత చేశారు.

TDP Nijam Gelavali Program: 'నిజం గెలవాలి' పేరుతో ప్రజాక్షేత్రంలోకి నారా భువనేశ్వరి

Chandrababu Wife Nara Bhuvaneswari Nijam Gelavali Schedule : చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేశారని, ఈ విషయం ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటు, మనోవేదనతో మృతి చెందిన కుటుంబాలకు ధైర్యం చెప్తూ భువనేశ్వరి "నిజం గెలవాలి" పర్యటన సాగనుంది. అందులో భాగంగా నేటి నుంచి మూడు రోజులు తిరుపతి జిల్లాలో పర్యటన చేయనున్నారు. ఈ నెల 26వ తేదీ అగరాలలో మహిళలతో, అలాగే అదేరోజు మహిళా ఆటో డ్రైవర్లతో నారా భువనేశ్వరి సమావేశం కానున్నారు. 27న శ్రీకాళహస్తిలో మహిళలతో ఆమె సమావేశం కానున్నారు. యాత్ర ముగిసిన తరువాత నారా భువనేశ్వరి హైదరాబాద్‍ పయనం అవుతారు.

Nara Bhuvaneshwari Visit to Tirumala: 'నిజం గెలవాలి' బస్సుయాత్ర.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి

టీడీపీ వర్గాలు దిశానిర్దేశం : జిల్లాలో నారా భువనేశ్వరి చేపట్టిన "నిజం గెలవాలి" బస్సు యాత్రకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీడీపీ వర్గాలు సిద్ధం తెలిపాయి. భువనేశ్వరి యాత్రను విజయవంతం చేయడానికి పార్టీ అధిష్టానం తిరుపతిలోని టీడీపీ వర్గాలకు దిశానిర్దేశం చేసింది.

డోర్ టు డోర్ ప్రచారం : ఆదివారం జరిగిన టీడీపీ, జనసేన ఉమ్మడి కార్యాచరణలో ఇరు పార్టీలు మరో కార్యకమానికి శ్రీకారం చుట్టాయి. నవంబరు 1న ఉమ్మడి మేనిఫెస్టో (TDP Janasena Manifesto) ప్రకటిస్తున్నట్లు నారా లోకేశ్ స్పష్టం చేశారు. అదే రోజు మేనిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు "డోర్ టు డోర్ ప్రచారం" కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోలో భాగంగా ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలకు.. జనసేన చేసిన సిఫార్సులను జోడించి నవంబర్ 1న ఐక్య కార్యాచరణ ప్రకటించి, ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ సిద్ధం చేశారు. అలాగే చంద్రబాబు అరెస్టుతో నిలిచిన 'బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ' కార్యక్రమాన్ని(Babu Surety Bhavishyathuku Gurantee Program) నవంబరు 1నుంచి లోకేశ్ పునరుద్ధరించనున్నారు.

Nara Bhuvaneshwari Nijam Gelavali Yatra: ప్రజల్లోకి భువనేశ్వరి.. నేటి నుంచి 'నిజం గెలవాలి' యాత్ర

Last Updated : Oct 26, 2023, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.