ETV Bharat / state

EO DHARMARDDY: ఈ సారి మాడ వీధుల్లో వాహన సేవలు: తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి

author img

By

Published : Jul 10, 2022, 8:01 AM IST

EO DHARMARDDY: సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని 3 కేంద్రాల్లో ఎప్పటి నుంచి జారీ చేయాలనే విషయంపై ధర్మకర్తల మండలి సమావేశంలో చర్చించి స్పష్టమైన ప్రకటన చేస్తామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. కొవిడ్‌తో రెండేళ్లుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించామని.. ఈ సారి మాడ వీధుల్లో వాహన సేవలు ఉంటాయని తెలిపారు.

EO DHARMARDDY
EO DHARMARDDY

EO DHARMARDDY: ఈ నెల 11న నిర్వహించనున్న తితిదే ధర్మకర్తల మండలి సమావేశంలో సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలోని 3 కేంద్రాల్లో ఎప్పటి నుంచి జారీ చేయాలనే విషయంపై చర్చించి స్పష్టమైన ప్రకటన చేస్తామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. శనివారం స్థానిక అన్నమయ్య భవనంలో తితిదే డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.

* తిరుమలలో గదులు పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. ప్రస్తుతానికి తిరుమలలోని 50 శాతం గదులను ఆన్‌లైన్‌లో, 50 శాతం గదులను ఆఫ్‌లైన్‌లో కేటాయిస్తున్నాం. భక్తులు వీలైనంత వరకు తిరుపతిలో తితిదే, ప్రైవేటు అద్దె గదుల్ని వినియోగించుకోవాలి.

* ప్రస్తుతం భక్తుల నుంచి నగదు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా గదుల అద్దె డిపాజిట్‌ స్వీకరిస్తున్నాం. తిరిగి వాటి చెల్లింపునకు కొంత సమయం పడుతుంది. త్వరలోనే యూపీఐ క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌ ద్వారా డిపాజిట్‌ చెల్లింపులు చేయడాన్ని పరిశీలిస్తున్నాం.

* కరోనా కారణంగా కొంతకాలం పాటు నిలిచిపోయిన అఖండ హరినామ సంకీర్తనను ఆగస్టు 1 నుంచి తిరిగి ప్రారంభిస్తాం.

* తిరుమలలోని శ్రీవారి పాతపోటులో దాత శ్రీనివాసన్‌ సహకారంతో మరో 45 థర్మోప్లూయిడ్‌ స్టౌలను ఏర్పాటు చేయనున్నాం. టాటా సంస్థ సహకారంతో త్వరలోనే మ్యూజియం పనులు పూర్తి చేస్తాం.

* కొవిడ్‌తో రెండేళ్లుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాం. ఈ సారి మాడ వీధుల్లో వాహన సేవలు ఉంటాయి. సెప్టెంబరు 27న సాయంత్రం 5.45 నుంచి 6.15 గంటల మధ్య మీనలగ్నంలో ధ్వజారోహణం జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్‌.. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అక్టోబరు 1న గరుడసేవ, 2న స్వర్ణరథం, 4న రథోత్సవం, 5న చక్రస్నానం ఉంటాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.