రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలను అధికార పార్టీ రెచ్చగొడుతోంది

author img

By

Published : Nov 20, 2022, 11:05 AM IST

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ()

CPI Narayan's comments on Jagan: రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలను అధికార పార్టీ రెచ్చగొడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తిరుపతి సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధాని అన్న ముఖ్యమంత్రి జగన్‍ నేడు మూడు రాజధానులు అనడం దిగజారుడు తనమేనన్నారు.

CPI Narayan's comments on Jagan:రాష్ట్రంలో ప్రాంతీయ విద్వేషాలను అధికార పార్టీ రెచ్చగొడుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. తిరుపతి సీపీఐ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి రాజధాని అన్న ముఖ్యమంత్రి జగన్‍ నేడు మూడు రాజధానులు అనడం దిగజారుడు తనమేనన్నారు.

విశాఖకు వచ్చి ప్రధాని ఇచ్చిన 11 వేల కోట్ల రూపాయల హామీలకే ఆనందంలో ఉన్న జగన్‍ విశాఖ ఉక్కు ప్రైవేటుకు అప్పగిస్తుంటే నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించారన్నారు. పోలవరం, ప్రత్యేక హోదా, ఉమ్మడి ఆస్తుల పంపిణీపై సిఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానిని ప్రశ్నించలేకపోయారన్నారు. విశాఖ వచ్చిన ప్రధాని పవన్ కల్యాణ్ ను పక్కచూపులు చూడొద్దని తన వైపే చూడమని చెప్పినట్లుందని.... వైకాపా విజయానికి సహకరించేలా వ్యవహరించారని ఆరోపించారు. వైసీపీ, బీజేపీ బంధం ఫెవికాల్ లాంటిదన్నారు. మార్గదర్శి చిట్ఫండ్ సంస్థపై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. ఆ సంస్థకు చెందిన అనేక శాఖల్లో తనిఖీ చేసిన అధికారులు చిన్నపాటి పొరబాటును కూడా గుర్తించలేకపోయారన్నారు. రాజకీయాల కోసం ఇలాంటి దాడులు దిగడాన్ని ఆయన తపుబట్టారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.