ETV Bharat / state

ప్రజల భవిష్యత్​ కోసమే నా పోరాటం: చంద్రబాబు

author img

By

Published : Jan 14, 2023, 11:31 AM IST

Updated : Jan 14, 2023, 7:40 PM IST

chandrababu
నారావారిపల్లె

TDP CHEIF NARA CHANDARBAU NAIDU COMMENTS: రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి పండుగ సంబరాలు అట్టహాసంగా ప్రారంభమైయ్యాయి. తెల్లవారుజాము నుంచే ఊరూవాడాలో 'భోగి' మంటలు మొదలయ్యాయి. ప్రజలు పట్టణాల నుంచి సొంతూళ్లకు చేరుకోవడంతో అన్ని గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో నారావారిపల్లెకు చేరుకుని సంక్రాంతి సంబరాల్లో పాల్గొని..పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

'నేను మాత్రం భవిష్యత్తు కోసం బ్రతుకుతాను'..చంద్రబాబు

TDP CHEIF NARA CHANDARBAU NAIDU COMMENTS: రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి పండుగ సంబరాలు అట్టహాసంగా ప్రారంభమైయ్యాయి. తెల్లవారుజాము నుంచే ఊరూవాడాలో 'భోగి' మంటలు మొదలయ్యాయి. ప్రజలు పట్టణాల నుంచి సొంతూళ్లకు చేరుకోవడంతో అన్ని గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి జిల్లాలోని నారావారిపల్లెకు చేరుకుని సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం.1 కాపీలను భోగి మంటల్లో వేసి చంద్రబాబు నాయుడు, టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. ముందుగా తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ భోగి-సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేశారు. పనికిరాని వస్తువులన్నింటితో పాటు జగన్ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నం.1 కాపీలను 'భోగి' మంటల్లో వేసి నిరసన తెలిపామన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్‌ అని గుర్తు చేశారు. తెలుగు జాతికి నందమూరి తారక రామారావు ఒక వరమని పేర్కొన్నారు. భారతదేశానికి గొప్ప సంపద యువతేనని, జన్మభూమికి అందరూ తరలివస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

నాలెడ్జ్‌ ఎకానమీకి ప్రాధాన్యత ఇచ్చాం. సాంకేతికతతో ప్రపంచం ఓ గ్రామంగా మారింది. జీ-20 సన్నాహక సదస్సులో ప్రధానితో సమావేశమయ్యా. 2047 విజన్‌పై ప్రధాని మోదీకి వివరించా. ఐటీలో ప్రపంచమంతా మన తెలుగువాళ్లే ఉన్నారు. ప్రజావేదిక విధ్వంసంతో జగన్‌ పాలన మొదలుపెట్టారు. ప్రజలపై పన్నులు, ఛార్జీల మోత మోగిస్తున్నారు. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికింది టీడీపీనే. కొంతమంది ఈరోజు కోసం బ్రతుకుతారు. మరికొంతమంది రేపటి కోసం బ్రతుకుతారు. కానీ, నేను మాత్రం భవిష్యత్తు కోసం బ్రతుకుతాను.- నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత

ఇంతవరకు నా సున్నితత్వం చూశారు.. ఇకపై కఠినాన్ని చూస్తారని చంద్రబాబు ప్రకటించారు. వడ్డీతో సహా అంతా తీర్చుకుంటామన్నారు. పోలీసులు ఆత్మవిమర్శ చేసుకుని విధులు నిర్వహిస్తే మంచిదని చంద్రబాబు తెలిపారు. పుంగనూరు కాదు 175 నియోజకవర్గాలు గెలవాలని చంద్రబాబు నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

గుర్తుపెట్టుకో పెద్దిరెడ్డి.. లెక్కలు రాసి పెడుతున్నా..: రాష్ట్రంలో వైకాపా పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారు. ప్రజల మెడపై కత్తి పెట్టి ఆస్తులు రాయించుకుంటున్నారు. పుంగనూరులో తెదేపా కార్యకర్తలు, నాయకులపై 40 రోజుల్లో 10 కేసులు పెట్టారు. కార్యకర్తలను పండగపూట జైల్లో పెట్టారు. దీనికి పెద్దిరెడ్డి తప్పక అనుభవిస్తాడు. గుర్తుపెట్టుకో పెద్దిరెడ్డి.. దుర్మార్గాలు చేస్తున్న ప్రతి ఒక్కరి లెక్కలు రాసి పెడుతున్నా. ఈ సంక్రాంతి సందర్భంగా చెబుతున్నా.. ఇంతకు ఇంతా చేస్తాం. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సైకో పాలన పోవడం ఖాయం. వచ్చే ఎన్నికలు తెదేపా, వైకాపాకు మధ్య కాదు. 5 కోట్ల మంది ప్రజలు.. సీఎం జగన్ రెడ్డికి మధ్య జరుగుతాయి. పోలీసులకు కూడా జరుగుతున్న తప్పులు తెలుసు. కానీ కొందరు పోలీసులు తప్పులు చేస్తూనే ఉన్నారు. అధికార పార్టీలో నాగభూషణం, రాజనాల కంటే పెద్ద విలన్లను మన రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ సైకోలు అంతా గుర్తుపెట్టుకోవాలి. ఏడాది తరువాత ఇక్కడ ఉంటారా.. పారిపోతారా అని. ఎక్కడికి పారిపోయినా ఈ సైకోలను తీసుకువచ్చి శిక్షిస్తా’’ అని చంద్రబాబు హెచ్చరించారు.

ఇవీ చదవండి

Last Updated :Jan 14, 2023, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.