ETV Bharat / state

తెలంగాణలో కొత్త పథకం..! ఇల్లు కట్టుకుంటే రూ.3 లక్షలు.. ఇది నియోజకవర్గంలో 2వేల మందికే!

author img

By

Published : Feb 6, 2023, 4:13 PM IST

House construction in Telangana
House construction in Telangana

Telangana: తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం.. నియోజకవర్గంలో 2వేల మందికి ₹3లక్షల చొప్పున ఆర్థికసాయం చేయనున్నట్లు శాసనసభలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ సాయాన్ని 15 రోజుల్లో ప్రారంభిస్తామని ఇటీవల మహబూబ్‌నగర్‌ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ప్రకటన కూడా చేశారు.

Financial Assistance for House construction in Telangana : తెలంగాణ రాష్ట్రంలోని పేదలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సొంత జాగా ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం.. నియోజకవర్గంలో 2వేల మందికి ₹3లక్షల చొప్పున ఆర్థికసాయం చేయనున్నట్లు శాసనసభలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ సాయాన్ని 15 రోజుల్లో ప్రారంభిస్తామని ఇటీవల మహబూబ్‌నగర్‌ బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు దీనిపై శాసనసభలో నిధులు కేటాయిస్తూ అధికారిక ప్రకటన వెలువడింది.

ముఖ్యమంత్రి కోటాలో మరో 25వేల మందికి ఆర్థికసాయం చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా మొత్తం 2.63లక్షల మందికి ₹7,890 కోట్లు ఇవ్వనున్నట్లు హరీశ్‌ వెల్లడించారు. అలాగే బడ్జెట్‌లో రెండు పడక గదుల ఇళ్లకు ₹12వేల కోట్లు కేటాయించారు. జీహెచ్ఎంసీ పరిధిలో 67,782 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని హరీశ్ రావు తెలిపారు. 32,218 ఇండ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉందని వెల్లడించారు. మరోవైపు బడ్జెట్‌లో పాతబస్తీ మెట్రోకు ₹500 కోట్లు, హైదరాబాద్‌ మెట్రో రైలుకు ₹15,00 కోట్లు కేటాయించారు. మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం ₹3వేలకు పెంచారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.