BHAVANAPADU PORT: న్యాయ సమీక్షకు భావనపాడు పోర్టు టెండర్లు

author img

By

Published : Sep 17, 2021, 7:23 AM IST

srikakulam-bhavanapadu-port-tenders-for-judicial-review

శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు ఓడరేవు మొదటి దశ పనుల కోసం 2021-22 షెడ్యూల్‌ ఆఫ్‌ రేట్‌ (ఎస్‌వోఆర్‌) ప్రకారం ఏపీ మారిటైం బోర్డు టెండరు ప్రతిపాదనలను రూపొందించింది. దీనిపై అభ్యంతరాలను వారంలో తెలపాలని మారిటైంబోర్డు సీఈవో మురళీధరన్‌ పేర్కొన్నారు.

శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు ఓడరేవు మొదటి దశ పనులను రూ.2,955.61 కోట్లతో చేపట్టడానికి రూపొందించిన టెండరు ప్రకటనను ఏపీ మారిటైం బోర్డు.. న్యాయ సమీక్షకు పంపింది. 2021-22 షెడ్యూల్‌ ఆఫ్‌ రేట్‌ (ఎస్‌వోఆర్‌) ప్రకారం టెండరు ప్రతిపాదనలను రూపొందించింది. ఇందులో భాగంగా 3.035 కి.మీల బ్రేక్‌ వాటర్స్‌, 3 బహుళ వినియోగ సరకు రవాణా బెర్తులు, బొగ్గు రవాణాకు ప్రత్యేక బెర్తు, 15.85 మిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల పూడిక తొలగింపు, పోర్టులో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను ప్రతిపాదించింది.

ఒప్పందం ప్రకారం 30 నెలల్లో పనులు పూర్తి చేయాలి. యాజమాన్య పద్ధతిలో పోర్టును అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టెండరు ప్రతిపాదనలను పారదర్శకత కోసం జుడిషియల్‌ ప్రివ్యూ వెబ్‌సైట్‌ www.judicialpreview.ap.gov.in ఏపీ మారిటైంబోర్డు వెబ్‌సైట్‌ ‌www.ports.ap.gov.inలో అందుబాటులో ఉంచింది. దీనిపై అభ్యంతరాలను వారంలో తెలపాలని మారిటైంబోర్డు సీఈవో మురళీధరన్‌ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: TTD: తితిదేభారీ జాబితాతో.. సామాన్యులకు దర్శనం కష్టం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.