ETV Bharat / state

బస్సులు సమయానికి వచ్చే వరకూ కదలం..

author img

By

Published : May 26, 2022, 3:02 PM IST

Passengers protest for Buses: సమయానికి బస్సులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని.. విద్యార్థులు, ప్రయాణికులు ఆందోళన చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం ఉప్పెన వలసలో చోటు చేసుకుంది.

Passengers protest for Buses not arriving on time
Passengers protest for Buses not arriving on time

Passengers protest for Buses: శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం ఉప్పెన వలస వద్ద బస్సులు సమయానికి రావడంలేదని విద్యార్థులు, ప్రయాణికులు, పరిసర గ్రామ ప్రజలు ఆందోళన చేపట్టారు. అంతేకాకుండా బస్సులు పూర్తి స్థాయిలో లేవని వాపోయారు. వారి ఆందోళనతో గంటల సమయం పాటు బస్సులు నిలిచిపోయాయి. దీంతో.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు, వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ సమస్య తెలుసుకున్న బూర్జి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విద్యార్థులకు, ప్రయాణికులకు నచ్చచెప్పారు. శాంతించని ఆందోళనకారులు ఆర్టీసీ అధికారులు రావాలని పట్టుపట్టారు. ఆర్టీసీ అధికారులు వచ్చి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

సమయానికి రాని బస్సులు...ఆందోళన చేపట్టిన ప్రయాణికులు...

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.