ETV Bharat / city

కోనసీమ అల్లర్లకు వారే కారణం.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా జగన్ ఇంటికే: చంద్రబాబు

author img

By

Published : May 26, 2022, 2:02 PM IST

Updated : May 27, 2022, 4:03 AM IST

Chandrababu on way to Ongole: ఎన్నికలు ఎప్పుడు జరిగినా.. జగన్‌ ఇంటికి పోవడం ఖాయమని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఒంగోలులో జరగనున్న తెలుగుదేశం మహానాడుకు పార్టీ అధినేత చంద్రబాబు బయల్దేరారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం నుంచి నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా తరలివెళ్లారు.

కోనసీమ అల్లర్లకు వారే కారణం
కోనసీమ అల్లర్లకు వారే కారణం

babu

కోనసీమలో అల్లర్లకు వైకాపాయే కారణమని.. వారే తమ మనుషుల్ని పెట్టుకుని అమలాపురంలో విధ్వంసం సృష్టించారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. వారి ఇళ్లను వారే తగలబెట్టుకుని ఇతరులపై బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు. మంత్రి ఇల్లు తగలబడిపోతుంటే అక్కడున్న పోలీసులు ఏం చేశారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్‌, దళిత యువకుడు సుబ్రహ్మణ్యం హత్య ఘటన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే కోనసీమలో చిచ్చు రేపారన్నారు.

"అందమైన కోనసీమలో చిచ్చుపెట్టిన ఘనత వైకాపాదే. అమలాపురంలో అధికార పార్టీకి చెందిన వ్యక్తులే తగులబెట్టారు. పోలీసుల సమక్షంలోనే మంత్రి ఇంటిపై దాడి చేశారు. వాళ్లే తగలబెట్టుకుని వేరే వాళ్లపై నిందలేస్తున్నారు. ప్రతిపక్షాలపై తోయడం జగన్‌కు అలవాటుగా మారింది. జగన్ చేస్తోన్న దానికి ఇంతకు ఇంత చెల్లిస్తా. ఆర్టీసీ బస్సులకు చలానాలు కడతామన్నా బస్సులు ఇవ్వరా?. ఆర్టీఏ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్‌ను భయపెడుతున్నారు. బీసీ పథకాలను ఈ ప్రభుత్వం గాలికొదిలేసింది. ఏం చెప్పాలని బస్సు యాత్ర చేపడుతున్నారు. ఎస్సీలకు చెందిన 28 పథకాలు రద్దు చేశారు. డ్రైవర్‌ను అనంతబాబు చంపేస్తే.. కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు."- చంద్రబాబు, తెదేపా అధినేత

శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న మహానాడు కోసం మంగళగిరిలోని తెదేపా కార్యాలయం నుంచి ఒంగోలుకు ప్రదర్శనగా వెళ్లిన చంద్రబాబు దారిలో చిలకలూరిపేట సమీపంలో తెదేపా కార్యకర్తలు, ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. సీఎం జగన్‌ పరిపాలన చేతకాక, అప్పులు పుట్టక, పథకాలు కొనసాగించలేక మధ్యంతర ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారని వివరించారు. ఆయనకు ఎలా బుద్ధి చెప్పాలో ప్రజలకు బాగా తెలుసని వ్యాఖ్యానించారు. 'క్విట్‌ జగన్‌... సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌' నినాదం రాష్ట్రమంతా మార్మోగాలని పిలుపునిచ్చారు.

"మహానాడు కోసం అద్దె ప్రాతిపదికన బస్సులు అడిగితే ఆర్టీసీ అధికారులు పిచ్చి పిచ్చి కారణాలతో నిరాకరించారు. ప్రైవేటు బస్సులు, విద్యాసంస్థల బస్సులు ఇవ్వడానికి సిద్ధపడ్డవారిపై రవాణా శాఖాధికారులు దాడులు చేస్తున్నారు. తెదేపా ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టుకోనివ్వకుండా అడ్డుకున్నారు. ఈ రాష్ట్రం ఏమైనా వైకాపా జాగీరా ? వారి ఆటలు సాగవు. ఇంతటి చిల్లర ముఖ్యమంత్రిని ఇంతవరకూ చూడలేదు. మహానాడుకు తాము ఎలాంటి ఇబ్బంది కలిగించట్లేదని ఓ మంత్రి మాట్లాడుతున్నారు. అలాంటప్పుడు సభ నిర్వహణకు ఒంగోలు మైదానాన్ని ఎందుకు ఇవ్వలేదు ? ఈ అడ్డంకులను తెలుగుదేశం కార్యకర్తలు లెక్క చేయొద్దు. ఏ వాహనం దొరికితే దానిపై మహానాడుకు రండి. అవసరమైతే ఎడ్లబళ్లపైన, కాలినడకైనా సరే తరలిరండి." -చంద్రబాబు. తెదేపా అధినేత

లక్షల మంది రోడ్డెక్కితే జగన్‌కు రాజపక్స గతే: చిలకలూరిపేటలో రూ.2కే 20 లీటర్ల తాగునీరు ఇచ్చే ఎన్టీఆర్‌ సుజల పథకాన్ని ప్రారంభిస్తుంటే మా పార్టీ నాయకులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కేసులు పెడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు.లక్షల మంది ఆగ్రహంతో రోడ్డెక్కితే జగన్‌ మోహన్‌రెడ్డి కూడా శ్రీలంక ప్రధాని మాదిరి పారిపోరా? రాజపక్సకు, అతని మంత్రులకు పట్టిన గతే జగన్‌కు పట్టదా? అని ఆక్షేపించారు. గడప గడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మంత్రుల్ని ప్రజలు నిలదీస్తుంటే సామాజిక న్యాయ బస్సుయాత్ర పేరిట మంత్రులు నాటకాలాడుతున్నారన్నారు. ఎస్సీల సంక్షేమం కోసం తెదేపా హయంలో ప్రవేశపెట్టిన 25 పథకాల్ని రద్దు చేయటమే సామాజిక న్యాయమా ? అని నిలదీశారు. రాష్ట్రానికి గతంలో తాను తీసుకొచ్చిన పరిశ్రమల్ని వ్యతిరేకించి, వాటితోనే ఇప్పుడు దావోస్‌లో ఒప్పం దాలు కుదుర్చుకుంటున్న జగన్‌.. స్టిక్కర్‌ ముఖ్యమంత్రేనని చంద్రబాబు ఎద్దేవా చేశారు.


ఇదీ చదవండి:

Last Updated : May 27, 2022, 4:03 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.