ETV Bharat / state

'సరైన దృక్పథం ఉంటేనే రాజకీయాల్లోకి రండి'

author img

By

Published : Jul 20, 2020, 9:12 AM IST

సరైనా దృక్పథం ఉంటేనే రాజకీయాల్లోకి రావాలని తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. ‘గ్రూమింగ్‌ లీడర్స్‌ విత్‌ రైట్‌ యాటిట్యూడ్‌’ అనే అంశంపై నెక్స్ట్‌ జనరేషన్‌ పొలిటికల్‌ లీడర్స్‌ ఫోరం నిర్వహించిన వెబినార్ లో ఆయన పాల్గొన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలనుకుంటే ఓపిక , సహనం, ఆత్మవిశ్వాసం ఎంతో ముఖ్యమని రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. ఆరోపణలు వచ్చినా ఆత్మవిశ్వాసం కోల్పోకూడదని సూచించారు.

తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు
తెదేపా ఎంపీ రామ్మోహన్ నాయుడు

యువత రాజకీయాల్లోకి రావాలనుకున్నప్పుడు సరైన దృక్పథం, విలువలు అవసరమని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు అన్నారు. రాజకీయాల్లోకి అందరూ రావచ్చని.. కాకపోతే ఎందుకు వచ్చాం? సమాజానికి ఏం చేస్తాం అనే అంశంపై పూర్తి అవగాహన ఉండాలన్నారు. ‘గ్రూమింగ్‌ లీడర్స్‌ విత్‌ రైట్‌ యాటిట్యూడ్‌’ అనే అంశంపై నెక్స్ట్‌ జనరేషన్‌ పొలిటికల్‌ లీడర్స్‌ ఫోరం నిర్వహించిన వెబినార్‌లో ఆయనతోపాటు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది పాల్గొన్నారు.

"క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాలి. ప్రజలు యువనేతల నుంచి వేగంగా స్పందన కోరుకుంటారు. ఓపిక, సహనం, ఆత్మవిశ్వాసం ఉండాలి. తొలినాళ్లలో ఓడిపోయినా నిరుత్సాహపడొద్దు. కళాశాల స్థాయి నుంచే నాయకత్వ లక్షణాలు రావాలి. ఆరోపణలు వచ్చినపుడు ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు. తొలిసారి ఒక పార్టీ గుర్తుపై గెలిచి మరో పార్టీకి వెళ్లాలనుకుంటే రాజీనామా చేసి గెలవాలి. ప్రస్తుతం లోక్‌సభలో తెదేపా ఫ్లోర్‌లీడర్‌గా ఉన్నానంటే పార్టీ చలవే. తెదేపా అధినేత చంద్రబాబు ఎంతో ప్రోత్సహించారు. తండ్రి మరణంతో కుంగిపోయిన నన్ను ఓదార్చి రాజకీయాల్లో ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇతర పార్టీలు, నేతలు కూడా ఇలా యువతను ప్రోత్సహించాలి. అయితే ఇందుకు కొంత సమయం పడుతుంది. 26 ఏళ్లకే రాజకీయాల్లో అవకాశాలు, నెగ్గుకురావడం చాలా కష్టం. నాకు తండ్రి ఇచ్చిన వారసత్వం ఉంది కాబట్టి రాగలిగా" అని రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు.

ఇదీ చదవండి : కరోనా లక్షణాలతో ఉప తహసీల్దారు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.