ETV Bharat / state

ఉద్దానం కిడ్నీ బాధితులను ఆదుకుంటాం : మంత్రి ఆళ్ల నాని

author img

By

Published : Feb 15, 2020, 7:41 PM IST

ఉద్దానం కిడ్నీ సమస్యల బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అన్నారు. స్పీకర్ తమ్మినేని సీతారాం, మరో మంత్రి ధర్మాన కృష్ణదాస్​తో కలిసి ఆయన శ్రీకాకుళం జిల్లా పలాస, ఉద్దానం ప్రాంతాల్లో పర్యటించారు. కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తుల కోసం నిర్మిస్తున్న డయాలసిస్ కేంద్రాన్ని వారు పరిశీలించారు.

Minister alla nani visits uddanam area in srikakulam
బొడ్డపాడులో మీడియాతో మాట్లాడుతున్న మంత్రి ఆళ్ల నాని

స్పీకర్ తమ్మినేని సీతాారాం, మంత్రులు ఆళ్ల నాని, ధర్మాన కృష్ణదాస్ ఉద్దానంలో పర్యటన

శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో శాసనసభాపతి తమ్మినేని సీతారాం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, రహదారులు - భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్​ పర్యటించారు. పలాసలో కిడ్నీ రోగుల కోసం నిర్మిస్తున్న డయాలసిస్ కేంద్రం, కిడ్నీ వ్యాధుల పరిశోధన కేంద్రాలను మంత్రులు పరిశీలించారు. అనంతరం పలాస మండలం ఉద్దానం ప్రాంతమైన బొడ్డపాడులో నిర్వహించిన సభలో వారు పాల్గొన్నారు. కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆదుకునేందుకు సీఎం జగన్ ప్రత్యేకంగా దృష్టిసారించారన్నారు. కిడ్నీ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి స్పష్టంచేశారు. నిపుణులు పరిశోధన ఆధారంగా తాగునీటి వలనే కిడ్నీ సమస్యలు వస్తున్నట్లు తెలిందన్నారు. శుభ్రమైన తాగునీరు అందించేందుకు వాటర్ గ్రిడ్ పథకాన్ని అమలుచేస్తున్నామన్నారు.

ఇదీ చదవండి : ఉద్దానం...పెద్ద గండమే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.