శ్రీకాకుళం తీరానికి కొట్టుకొచ్చిన మందిరం.. ఒడ్డుకు చేర్చిన స్థానికులు

author img

By

Published : May 10, 2022, 8:09 PM IST

సముద్రంలో కొట్టుకొచ్చిన మందిరం

అలల తాకిడికి శ్రీకాకుళం జిల్లా ఎం.సున్నాపల్లి పరిధిలోని సముద్ర తీరానికి ఓ మందిరం కొట్టుకొచ్చింది. అది డ్రమ్ములతో చేసిన నాటు పడవపై ఉంది. అసని తుపాను ప్రభావంతో బంగాళాఖాతంలో భారీఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి.

శ్రీకాకుళం తీరానికి కొట్టుకొచ్చిన మందిరం.. ఒడ్డుకు చేర్చిన స్థానికులు

శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఎం.సున్నాపల్లి గ్రామ పరిధిలోని సముద్రతీరానికి ఓ మందిరం కొట్టుకొచ్చింది. అలల తాకిడికి తీరం సమీపంలోకి రావడంతో మందిరాన్ని స్థానికులు తాళ్లు కట్టి ఒడ్డుకు చేర్చారు. అది డ్రమ్ములతో చేసిన నాటు పడవపై ఉంది. విషయం తెలుసుకున్న మెరైన్ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆ మందిరం మన దేశానికి చెందిందా..? లేక వేరే దేశానికి చెందినదా? అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ మందిరాన్ని చూసేందుకు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు అక్కడకి చేరుకున్నారు.

ఇదీ చదవండి:

దిశ మార్చుకున్న 'అసని'.. రాష్ట్రంలో అతిభారీ వర్షాలకు ఛాన్స్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.