ETV Bharat / state

Housing Lands To YSRCP Supporters: సీఎం చెబుతున్న అర్హతలే ప్రామాణికాలు ఇవేనా! వైసీపీ మద్దతుదారులకే ఇళ్ల స్థలాలు..!

author img

By

Published : Aug 6, 2023, 7:24 PM IST

Housing Lands To YSRCP Supporters: కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, అర్హతలే ప్రామాణికంగా సంక్షేమ పథకాల అందిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఇళ్ల పట్టాల విషయంలో అర్హులకు కాకుండా.. అర్హత లేకున్నా సొంత పార్టీ నేతలకు, అయినవారికే కట్టబెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Housing_Lands_To_YSRCP_Supporters
Housing_Lands_To_YSRCP_Supporters

Housing Lands To YSRCP Supporters: శ్రీకాకుళం గ్రామీణ మండలం చాపురం, సిద్దిపేట, గోవిందపురం గ్రామాల్లో ఇల్లు లేని వారి కోసం జగనన్న కాలనీలో 219 మందికి ఇళ్ల స్థలం కేటాయించారు. అయితే ఇల్లు స్థలాలు కేటాయించిన వారిలో అనర్హులు 79 మంది ఉన్నారంటూ స్థానికులు ఆందోళన చేస్తున్నారు.

అర్హులైన పేదవారు 65 మంది ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నా.. వాటిని రాకుండా వైసీపీ నాయకులే అడ్డుకుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అనర్హులైన 79 మంది.. వైసీపీ కార్యకర్తలేరని వారందరికీ ఇల్లు, పొలాలు ఉన్నా.. వారికి ఇళ్ల స్థలాలు ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు. గతంలో అనర్హులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంపై జిల్లా కలెక్టర్​ను స్థానికులు ఆశ్రయించగా అధికారులు విచారణ జరిపి వారికి కేటాయించిన స్థలాలను రద్దు చేశారు.

State Govt ignore Jaljeevan Mission: తాగునీటికి పైసా ఖర్చు పెట్టని జగన్ ప్రభుత్వం.. గ్రామీణ ప్రాంతాల్లో దాహం కేకలు

అయితే తాజాగా నియోజకవర్గం ఎమ్మెల్యే మంత్రి ధర్మాన ప్రసాద్ రావు ప్రోద్బలంతో అనర్హులైన 79 మందికి మళ్లీ పట్టాలను అందించారు. కేవలం వైసీపీ పార్టీకి విధేయత చూపలేనందుకే అర్హులైన 64 మందికి స్థలాలు దక్కకుండా అధికారులకు మంత్రి ఆదేశాలు ఇచ్చినట్లు స్థానికులు చెప్తున్నారు.

చాపురం పంచాయితీలో ఇప్పటికే ఇళ్ల పట్టాలు వచ్చినా.. ఇళ్లస్థలాలు కేటాయించకుండా, ఇల్లు కట్టుకోనివ్వకుండా అధికారులు అడ్డుకుంటున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అర్హులకు స్థలాలు కేటాయించడం జియో టాకింగ్ కూడా పూర్తయిన కేవలం వైసీపీ పార్టీయేతర వారు కావడంతో వారికి స్థలాలు కేటాయించడం లేదు.

Visakha YCP Leaders Focus on Assigned Lands: విశాఖ అసైన్డ్ భూములపై వైసీపీ నేతల కన్ను.. బెదిరించి ఒప్పందాలు

ఈ గ్రామాల్లో నివసిస్తున్న వారు పేదవారు నిరక్షరాశులు కావడంతో అధికారుల చుట్టూ తిరగలేక ఏం చేయాలో తెలియని పరిస్థితి ఉందంటున్నారు. తమ సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా తమని పట్టించుకోకపోగా అధికారుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని బాధితులు అంటున్నారు.

అర్హత లేని వారికి ఆఫ్​లైన్ పట్టాలు ఇవ్వడంతో ఏం చెయ్యాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నామంటున్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా ఇళ్ల స్థలాలు విషయంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరారు. అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

UnderGround Drainage Works: ఏపీలో పడకేసిన పారిశుద్ధ్యం.. యూజీడీకి మంగళం పాడేసిన వైసీపీ సర్కార్..

"ఇక్కడ నిజమైన అర్హత ఉన్న వారు పథకాలకు దూరమవుతున్నారు. రాజకీయపరంగానే ఇస్తున్నారు. అర్హత లేని వారు లబ్ది పొందుతున్నారు. ఇది చాలా సార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లాం. అయినా సరే మార్పు లేదు. అర్హత ఉన్నవారు 64 మంది ఉన్నారు. వారందరికీ ఆన్​లైన్ అవ్వకుండా అడ్డుపడుతున్నారు. పేదవాళ్లకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం". - బాధితుడు

"జగనన్న ఇల్లు కోసం నేను అర్జీ పెట్టుకున్నాను. లిస్ట్​లో పేరు కూడా ఉంది. కానీ ప్రస్తుతం నాకు ఇవ్వకుండా చేస్తున్నారు. వారికి అనుకూలమైన వారికే ఇస్తున్నారు". - బాధితుడు

Housing Lands To YSRCP Supporters: వైసీపీ మద్దతుదారులకే ఇళ్ల స్థలాలు.. పేదలకు దక్కని న్యాయం
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.