ETV Bharat / state

'ఆపరేషన్ ధృవ' సక్సెస్.. ఇటుక బట్టీల వద్దకే బడి పాఠాలు

author img

By

Published : Dec 25, 2022, 9:42 AM IST

Schools in a brick kiln
ఇటుక బట్టీలో పాఠశాలలు

Schools In Brick kiln: ఇటుక బట్టీల్లో అక్షరచైతన్యం మొదలైంది. తల్లిదండ్రులతో కలిసి బట్టీల్లోకి పనులకు వెళ్లకుండా చదువుకునేందుకు తెలంగాణలోని పెద్దపల్లి పోలీసులు ఆపరేషన్ ధృవ పేరుతో పకడ్బందీ ఏర్పాట్లు చేసి ఆదర్శంగా నిలుస్తున్నారు. దశాబ్దాలుగా ఉపాధి కోసం తల్లిదండ్రులు వలస వస్తే వారితో వచ్చే చిన్నారుల బాల్యం బుగ్గిపాలవుతోంది. పలక, బలపం పట్టాల్సిన చిట్టిచేతులు బట్టీల్లో ఇటుకలను పట్టేపరిస్థితి ఉండేది. దీనిని నివారిస్తూ.. ప్రస్తుతం పోలీసులు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి చిన్నారులు చదువుకునే ఏర్పాటు చేశారు.

Schools In Brick kiln: తెలంగాణ పెద్దపల్లి జిల్లాలో ఇటుక బట్టీల్లో పని చేయడానికి వేలాది మంది కూలీలు కుటుంబ సమేతంగా వలస వస్తుంటారు. ఏటా నవంబర్ నుంచి మే వరకు బట్టీల్లో పనులు కొనసాగుతాయి. కొంత మంది గుత్తేదారులు వివిధ రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకువస్తుంటారు. ఈ వలసల కారణంగా చదువుతో ఉత్తమ భవిష్యత్‌ను అందుకోవాలని ఆశించినా, ఆర్థిక స్థితిగతుల అడుసులో కూరుకుపోయి చిన్నారులు.. పాఠశాలకు దూరమై పోతున్నారు.

తల్లిదండ్రులు సైతం బతుకు భారాన్ని అతి పిన్న వయస్సుల్లోనే చిన్నారులపై వేయాల్సిన పరిస్థితి ఉండేది. పలక,బలపం చేతబట్టి అక్షరాలు దిద్దాల్సిన బాల్యం.. నల్లమట్టిని ఇటుకలుగా మార్చే పనిలో మగ్గిపోయేది. దీంతో పెద్దపల్లి జిల్లా పోలీసులు సరికొత్త ప్రణాళికను అమలు చేశారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా 80 ఇటుక బట్టీలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వివిధ రాష్ట్రాల నుంచి కార్మికులు వందల సంఖ్యలో ఇక్కడికి వలస వచ్చి పనిచేస్తున్నట్లు.. వారి కోసం ఆయా బట్టీల్లోనూ పాఠశాలలు ఏర్పాటు చేయాలని యజమానులకు సూచించారు.

ఇటుక బట్టీల వద్దకే.. బడి పాఠాలు

కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలు: తూతూ మంత్రంగా కాకుండా చిన్నారులను ఆకర్షించే విధంగా కార్పొరేట్ స్థాయిలో పాఠశాలలు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకున్నారు. బొమ్మలు, రంగు రంగుల పెయింటింగ్స్‌ ఆటవస్తువులు టీవీ, ఎల్‌ఈడీలతో తీర్చిద్దడంతో చిన్నారుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. కార్టూన్ల ద్వారా చుదువుకోవడంతో పాటు టీవీ చూడటానికి ఆసక్తి చూపుతున్నారు. యునిఫాంతో పాఠశాలకు వెళ్లే విధంగా చర్యలు తీసుకున్నారు.

బట్టీ యజమానులకు పోలీసుల ఆదేశం: ప్రధానంగా చిన్నారులకు ఒడియాతో పాటు హిందీ.. ఆంగ్లం పట్ల అవగాహన కల్పిస్తున్నారు. వారివారి ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులతో పాటు స్థానిక ఉపాధ్యాయులను నియమించారు. ఇటుక బట్టీల వద్ద పని చేసే కార్మికుల పిల్లల కోసం అక్కడే పాఠశాలలు ఏర్పాటు చేయాలన్న నిబంధనను కచ్చితంగా అమలు చేయాల్సిందేనని బట్టీ యజమానులకు పోలీసులు ఆదేశించడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు .30నుంచి 40 మంది పిల్లలు ఉన్న బట్టీ ఉంటే అక్కడే పాఠశాల ఏర్పాటు చేయడం సంఖ్య ఎక్కువగా లేని చోట్లలో రెండు మూడు బట్టీలకు కలుపుకొని ఏర్పాటుచేసే విధంగా చర్యలు తీసుకున్నారు.

"చిన్న పిల్లలకు ఏ భాష చెప్పినా వారు త్వరగా అర్థం చేసుకుంటారు. అందుకే ఒడియా, ఆంగ్లం భాషలను చెప్పించడం జరుగుతుంది. ఒడిశా నుంచి ఉపాధ్యాయులతో పాటు స్థానిక ఉపాధ్యాయులు పిల్లలకు పాఠాలు బోధిస్తున్నారు. చిన్నారులు చదువుకునేందుకు వీలుగా మా వంతు ప్రయత్నం చేస్తున్నాం." -రూపేష్‌, పెద్దపల్లి డీసీపీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.