ETV Bharat / state

పలాస కొవిడ్ కేర్ కేంద్రంలో.. చక్రాలపై ఆక్సిజన్ సరఫరా

author img

By

Published : May 26, 2021, 1:07 PM IST

భారత నౌకాదళం రూపొందించిన చక్రాలపై ఆక్సిజన్ సరఫరా పద్దతిని.. శ్రీకాకుళం జిల్లా పలాస కొవిడ్ కేర్ కేంద్రానికి తూర్పునౌకాదళం సమకూర్చింది. ఆక్సిజన్ ఆన్ వీల్స్ పేరిట నేవల్ డాక్ యార్డ్ రూపొందించిన ఈ కార్యక్రమంతో.. మారుమూల ప్రాంతాల్లోని రోగులకు ఆక్సిజన్ అందించేందుకు వీలవుతోంది.

పలాస కొవిడ్ కేర్ కేంద్రంలో చక్రాలపై ఆక్సిజన్ సరఫరా పద్దతి
oxygen supply system on wheels to Palasa covid Care Center

భారత నౌకాదళం రూపొందించిన చక్రాలపై ఆక్సిజన్ సరఫరా పద్దతిని శ్రీకాకుళం జిల్లా పలాస కొవిడ్ కేర్ కేంద్రానికి తూర్పునౌకాదళం సమకూర్చింది. ఆక్సిజన్ ఆన్ వీల్స్ పేరిట దీన్ని విశాఖలోని నేవల్ డాక్ యార్డ్ సాంకేతిక సిబ్బంది రూపొందించారు. ఈ టాంకర్​ ద్వారా నేరుగా పైపుల్లోకి పంపి రోగులకు అక్సిజన్​ అందించే పద్దతిని ఇక్కడ వినియోగించారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ అభ్యర్ధన మేరకు తూర్పునౌకాదళం ఈ ఏర్పాటు చేసింది.

మంత్రి అప్పలరాజు, ఇతర అధికారుల సమక్షంలో నేవీ బృందం.. ఈ ఆక్సిజన్ టాంకర్​తో నేరుగా పైపులు అనుసంధానం చేసి అక్కడ ఉన్న 12 మంది కొవిడ్ బాధితులకు నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా చేస్తోంది. నేవీ బృందం ఆసుపత్రి వర్గాలకు ఈ మొబైల్ ప్లాంట్ నిర్వహణ అంశంలోనూ శిక్షణ ఇచ్చింది. దీని ద్వారా మారుమూల ప్రాంతాల్లో ఆక్సిజన్ సరఫరాకు వీలవుతోంది. దీన్ని.. ఇటీవలే తూర్పు నౌకాదళ ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ ఏబీ సింగ్ లాంఛనంగా ఆమోదించి, ప్రారంభించారు. క్షేత్ర స్ధాయిలో అవసరాలను బట్టి వీటిని ఉపయోగిస్తారు.

ఇదీ చదవండి:

'ఆనందయ్య మందు కోసం ఎవరూ రావొద్దు.. కృష్ణపట్నంలో 144 సెక్షన్'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.