ETV Bharat / state

ఎరక్కపోయి వచ్చి.. ఇలా ఇరుక్కుపోయాడు!

author img

By

Published : Apr 5, 2022, 4:43 PM IST

Updated : Apr 5, 2022, 5:09 PM IST

అనుకున్నది ఒక్కటి.. అయినది ఒకటి అన్నట్లు ఉంది ఆ దొంగ పరిస్థితి. దొంగతనానికి వచ్చిన ఆ దొంగ ఓ గోడ కన్నంలో ఇరుక్కుపోయాడు. చివరకు బయటికి వచ్చాడో? లేదో? తెలుసుకోవాలంటే ఇది చూడండి.

thief in wall hole
గోడ కన్నంలో ఇరుక్కున్న దొంగ

ఈ వీడియోలో ఉన్న యువకుడిని చూశారా.. ? అతను ఏదో సర్కస్​ చేస్తున్నాడని అనుకుంటున్నారా..? లేదు.. గుడికి వచ్చి బయటకు వెళ్లేందుకు ఇలా ప్రయత్నించి ఇరుక్కుపోయాడు. అదేంటి గుడికి వెళ్లిన అతను మంచిగా ద్వారం నుంచి వెళ్లవచ్చుగా అనుకుంటున్నారా..? అతను వచ్చింది దైవదర్శనానికి కాదు.. దొంగతనం చేసేందుకు వచ్చాడు. లోపలికి తేలికగానే వెళ్లిన అతను తిరిగి బయటకు వచ్చే క్రమంలో ఇలా ఇరుక్కుపోయాడు. అతనిని గమనించిన స్థానికులు పోలీసులకు పట్టించారు. ఇంతకి అతను ఎవరూ? ఇది ఎక్కడ జరిగిందనుకుంటున్నారా? అతని పేరు రీస్​ పాపారావు, శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జాడుపూడి గ్రామంలోని జామి ఎల్లమ్మ ఆలయంలో చోరీ చేసేందుకు వచ్చాడు.

గోడ కన్నంలో ఇరుక్కున్న దొంగ

ఇదీ చదవండి: CM delhi tour: సీఎం జగన్​ దిల్లీ పర్యటన.. సాయంత్రం ప్రధాని మోదీతో భేటీ

Last Updated : Apr 5, 2022, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.