ETV Bharat / state

"వైకాపా నాయకా.. ఆ యంత్రాలు స్వచ్ఛభారత్ కోసం.. మీ కోసం కాదు"!

author img

By

Published : Jun 27, 2022, 7:57 AM IST

స్వచ్ఛభారత్ పథకం కింద గ్రామానికి కేటాయించిన యంత్రాన్ని.. ఓ వైకాపా నాయకుడు తన సొంత పనులకు వినియోగించుకోవడం చర్చనీయాంశమైంది. తన ఇంటి ముందు ఉన్న మట్టిని చదును చేసేందుకు.. స్వచ్ఛభారత్ యంత్రాలను వినియోగించుకున్న ఘటన.. శ్రీ సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది.

ysrcp leader used swacha bharat machine for his personal works at satya sai district
సొంత పనులకు స్వచ్ఛభారత్ యంత్రం

సొంత పనులకు స్వచ్ఛభారత్ యంత్రాన్న ఉపయోగించిన వైకాపా నాయకుడు

స్వచ్ఛభారత్ పథకం కింద గ్రామానికి కేటాయించిన యంత్రాన్ని.. ఓ వైకాపా నాయకుడు తన సొంత పనులకు వినియోగించుకోవడం చర్చనీయాంశమైంది. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరుకు చెందిన వైకాపా నాయకుడు శ్రీనివాసులు.. తన ఇంటి ముందు ఉన్న మట్టిని చదును చేసేందుకు.. ఏకంగా స్వచ్ఛభారత్ యంత్రాలను వినియోగించుకున్నాడు.

గ్రామ పంచాయతీకి స్వచ్ఛభారత్ పథకం ద్వారా మినీ జేసీబీ, ట్రాక్టర్‌ ఇచ్చారు. వీటిని ఎవరి అనుమతీ లేకుండా వైకాపా నాయకుడు శ్రీనివాసులు ఉపయోగించుకోవడం.. స్థానికంగా చర్చకు దారి తీసింది. శ్రీనివాసులు వ్యవహారంపై స్థానికులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వం కేటాయించిన యంత్రాలను.. ఓ ప్రైవేటు వ్యక్తి తన అవసరాలకు ఎలా వినియోగిస్తారని గ్రామస్థులు.. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు.. యంత్రాల వాడకాన్ని నిలిపివేశారు.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.