Tension: హిందూపురం ప్రెస్​ క్లబ్ వద్ద ఉద్రిక్తత.. ఏం జరిగిందంటే..?

author img

By

Published : Sep 28, 2022, 4:20 PM IST

Hindupuram Press Club

Tension at Hindupuram Press Club: హిందూపురం ప్రెస్​క్లబ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. వైకాపా కార్యకర్తలు, తెలుగుదేశం శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. అక్కడికి వచ్చిన పోలీసులు.. రెండు పార్టీల నాయకులను అక్కడనుంచి పంపించి వేశారు. అనవసరంగా అడ్డుకున్న వైకాపా వర్గీయులను అరెస్టు చేయాలంటూ తెదేపా శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు.

Tension at Hindupuram Press Club: సత్యసాయి జిల్లా హిందూపురం ప్రెస్​క్లబ్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న చిలమత్తూరు మండలంలో వైకాపా ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్.. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పట్ల చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ స్థానిక ప్రెస్​క్లబ్​లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. విలేకరుల సమావేశం అనంతరం తెదేపా శ్రేణులు బయటికి వెళ్లే సమయంలో మూకుమ్మడిగా వచ్చిన వైకాపా కార్యకర్తలు.. తెదేపా శ్రేణులను అడ్డుకొని నినాదాలు చేశారు. వారిని ప్రతిఘటిస్తూ తెదేపా శ్రేణులు సైతం జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాల వారిని అక్కడనుంచి పంపించి వేశారు. వైకాపా గూండాలను వెంటనే అరెస్టు చేయాలంటూ తెదేపా శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. గత మూడు నెలల కాలంలోనే వైకాపా శ్రేణులు.. ప్రెస్​క్లబ్​లో దాడులకు ప్రయత్నించడం ఇది రెండోసారి అని తెదేపా శ్రేణులు ఆరోపించారు.

హిందూపురం ప్రెస్​క్లబ్ వద్ద ఉద్రిక్తత

ఈ ఘటన సమయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళ కార్యదర్శి రామాంజనమ్మ పట్ల వైకాపా నాయకులు అనుచితంగా ప్రవర్తించి కులం పేరుతో దూషించారంటూ వన్​టౌన్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. రామాంజనమ్మ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వైకాపా నాయకులను వెంటనే అరెస్టు చేయాలని.. లేకపోతే వారి నుంచి తమకు ప్రాణం ఉందంటూ సీఐకి తెదేపా శ్రేణులు ఫిర్యాదు చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.