సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదు: పారిశుద్ధ్య కార్మికులు

author img

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Jan 10, 2024, 8:17 PM IST

Municipal Workers Strike

Municipal Workers Strike in 16th Day in AP: మున్సిపల్ కార్మికులు చేపట్టిన సమ్మె గత 16 రోజులుగా కొనసాగుతోంది. కనీస వేతనాల పెంపు, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు సిబ్బందిని పర్మినెంట్ చేయాలని పారిశుద్ధ్య కార్మికులు కోరుతున్నారు. సీఎం పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని పారిశుద్ధ్య కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలను పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదని తేల్చి చెప్పారు.

సమస్యలు పరిష్కరించేంత వరకు సమ్మె విరమించేది లేదు: పారిశుద్ధ్య కార్మికులు

Municipal Workers Strike in 16th Day in AP: రాష్ట్రంలో మున్సిపల్‌ కార్మికులు చేపట్టిన సమ్మె 16వ రోజూ ఉద్ధృతంగా కొనసాగింది. కనీస వేతనాల పెంపు, ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్టు సిబ్బందిని పర్మినెంట్ చేయాలని కోరుతూ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళనలు నిర్వహించారు. సీఎం జగన్‌ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే సమ్మె మరింత ఉద్ధృతమవుతుందని తేల్చి చెప్పారు.

Municipal Workers Strike Satyasai District: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో మున్సిపల్ కార్యాలయం వద్ద కళ్లకు గంతలు కట్టుకొని మోకాళ్లపై నిలబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జగన్ ట'గోవిందా గోవిందా' అంటూ నిరసన తెలిపారు. అనంతపురంలో మున్సిపల్ కార్యాలయం ముట్టడికి కార్మికులు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు కార్మికుల మధ్య తీవ్ర తోపులాట జరిగింది. ఆందోళనలో పాల్గొన్న ఏఐటీయూసీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్​కు తరలించారు. కళ్యాణదుర్గంలో పారిశుద్ధ్య కార్మికులు ర్యాలీ నిర్వహించి బిక్షాటన చేశారు.

'ఇచ్చిన హామీలను జగన్‌ మరిచారు' - ఈనెల 26 నుంచి మున్సిపల్ కార్మికుల నిరవధిక సమ్మె

Nandyal District: నంద్యాలలో మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్లు వినూత్న నిరసన తెలిపారు. న్యాయం జరిగే దాకా సమ్మె విరమించేది లేదని రహదారిపై భీష్మించారు. మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట భిక్షాటన చేశారు. కమిషనర్ రవి చంద్రారెడ్డిని బిక్షం వేయాలని ప్రాధేయపడ్డారు. ఒంగోలు మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. చెత్త వాహనాలను అడ్డుకొన్నారు. ప్రైవేట్ వ్యక్తుల చేత పనులు చేయించడాన్ని నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. పోలీసులతో బెదిరిస్తే సమ్మెను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె ఉద్ధృతం - రెండో రోజు మున్సిపల్ కార్మికులు పోరు బాట

Nellore District: నెల్లూరులో మున్సిపల్ కార్మికులు భారీ ప్రదర్శన నిర్వహించారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ నినదించారు. కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరుతూ ..విశాఖలో మున్సిపల్ కార్మికులు ఆందోళన చేశారు. చర్చల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందని మండిపడ్డారు. రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం వద్ద బైఠాయించారు. కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై మానవహారం నిర్వహించారు.

తొలగిస్తున్నామంటూ అధికారుల నోటీసులు-బెదిరింపులకు భయపడమంటూ, నోటీసులను తగులబెట్టిన మున్సిపల్ కార్మికులు

Municipal Workers Strike in Vijayawada: ప్రభుత్వం డిమాండ్లను నెరవేర్చకుండా చర్చలతో కాలయాలన చేస్తోందని మున్సిపల్ కార్మికులు మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించాలని మున్సిపల్ కార్మికులు 16వ రోజూ ఆందోళన చేశారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని విశాఖ కార్మికులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం మొండికేస్తే వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.

మున్సిపల్‌ కార్మికులు ఆందోళనలు - ఉక్కుపాదం మోపిన పోలీసులు

Municipal Workers Strike in All Districts: ప్రకాశం జిల్లా కనిగిరిలో పొర్లుదండాలు పెట్టి నిరసన తెలిపారు. విజయనగరంలో కార్మికులు భిక్షాటన చేశారు. సమస్యలు పరిష్కరించే వరకూ ఉద్యమం ఆపేది లేదని వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు కార్మికులు తేల్చి చెప్పారు. అనంతపురంలో భారీ ర్యాలీ చేపట్టారు. తర్వాత ఆర్డీ కార్యాలయం ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో కార్మికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. నంద్యాల మున్సిపల్ కమిషనర్ కార్యాలయం ఎదుట భిక్షాటన చేసి నిరసన తెలిపారు. కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని కార్మికులు డిమాండ్ చేశారు.

మరోసారి మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చలకు సిద్ధమైన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.