ETV Bharat / state

YSRCP: గడప గడపలో గ్రామస్తుల నిరసన.. వెనుతిరిగిన ఎమ్మెల్యే

author img

By

Published : Oct 8, 2022, 8:52 PM IST

YSRCP Gadapa Gadapa :వైకాపా ఎమ్మెల్యేలకు గడపగడలో నిరసన సెగ తగులుతోంది. ప్రజల సమస్యలను పరిష్కరిస్తామని వస్తున్న ఎమ్మెల్యేలను ప్రజలు గ్రామ పొలిమేరను సైతం తొక్కనివ్వడంలేదు. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబు రాకను నిరసిస్తూ.. ఓ గ్రామస్థులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ప్రజలు నిరసన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆ గ్రామంలో పర్యటించకుండానే వెనుదిరిగారు.

YSRCP Gadapa Gadapa
గడప గడపలో గందరగోళం

MLA Sudhakar Babu: ప్రకాశం జిల్లా సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్‌బాబుకు నియోజకవర్గ ప్రజల నుంచి చేదు అనుభవం ఎదురైంది. గడపగడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నాగులుప్పలపాడు మండలం కనపర్తికి ఎమ్మెల్యే సుధాకర్‌బాబు వస్తున్నారని తెలిసింది. గ్రామప్రజలు నిరసన చేపట్టారు. ఎమ్మెల్యే తమ గ్రామంలోకి రావొద్దంటూ.. నల్లబ్యాడ్జీలతో, నల్ల జెండాలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఎమ్మెల్యే గోబ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. సమాచారమందుకున్న ఎమ్మెల్యే సుధాకర్‌బాబు కనపర్తికి వెళ్లకుండా మార్గమధ్యలోనే వెనుదిరిగారు.

మూడేళ్లుగా తమ కష్టాలను పట్టించుకోని ఎమ్మెల్యే ఇప్పుడు గ్రామంలోకి ఎలా అడుగుపెడతారంటూ ప్రజలు నిలదీశారు. తమ ఓట్లతో ఎన్నికల్లో గెలిచిన సుధాకర్‌బాబు తర్వాత ప్రజల సమస్యలను పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పక్క గ్రామమయిన వినోదరాయునిపాలెం ప్రజలు సైతం ఎమ్మెల్యే తమ గ్రామానికి రావొద్దంటూ తీర్మానం చేసి అధికారులకు అందించారు. దీంతో ఎమ్మెల్యే ఆ గ్రామంలో పర్యటించలేదు. కనపర్తిలో గడపగడపకు కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించుకున్నారు.

గడప గడపలో గందరగోళం

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.