ETV Bharat / state

నల్లమలలో భారీ వర్షంతో పలు రైళ్లకు అంతరాయం

author img

By

Published : Sep 17, 2019, 6:41 PM IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో రైలు పట్టాల కింద కంకర కొట్టుకుపోయింది. దీంతో నంద్యాల, దిగువమెట్ట స్టేషన్లలో యశ్వంత్​పూర్-విజయవాడ, గుంటూరు-కాచిగూడ ప్యాసింజర్ రైళ్లను అధికార్లు నిలిపివేశారు.

నల్లమలలోని వర్షాలతో పలు రైళ్లకు అంతరాయం

నల్లమలలోని వర్షాలతో పలు రైళ్లకు అంతరాయం

ప్రకాశం జిల్లా నంద్యాల, దిగువమెట్ట స్టేషన్లలో యశ్వంత్ పూర్-విజయవాడ, గుంటూరు-కాచిగూడ ప్యాసింజర్ రైళ్లను నిలిపివేశారు. గిద్దలూరు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు రైల్వే ట్రాక్ పై నీరు ప్రవహించటంతో, పట్టాల కింద కంకర కొట్టుకొని పోయింది. ట్రాక్ దెబ్బతిన్న కారణంగా రైళ్ల నిలిపివేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇవీ చూడండి-కర్నూలులో భారీ వర్షం..నీట మునిగిన పుణ్యక్షేత్రం

Intro:గుంటూరు నగరంలో బారీ వాన కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు వాన ఉపశమనాన్ని ఇచ్చింది. రెండుగంటలపాటు కురిసిన వర్షానికి నగరంలోని పలు రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ముడువంతెనల కూడలి, అమరావతి రోడ్ , పాత గుంటూరు, కంకరగుంట అండర్ బ్రిడ్జి వర్షపు నీరు నిలిచి రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు..


Body:గుంటూరు పశ్చిమ


Conclusion:kit no765
భాస్కరరావు
8008574897
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.