ETV Bharat / state

ARREST OF ROBBERS: కారు డ్రైవరే సూత్రధారి...ముఠాగా ఏర్పడి..

author img

By

Published : Sep 7, 2021, 3:12 PM IST

Updated : Sep 7, 2021, 4:14 PM IST

పోలీసులమని చెప్పి ఓ కారును ఆపారు... మీ దగ్గర ఉన్న డబ్బుకు లెక్కలు చూపాలని వారిని బెదిరించారు.. నల్లధనం ఉందని సమాచారంతోనే వచ్చామన్నారు.. డీఎస్పీ గారు పిలుస్తున్నారు పోలీసు స్టేషన్​కు వెళ్దామని చెప్పి కత్తితో బెదిరించి..నగదుతో ఉడాయించారు. ఆలస్యంగా బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు తమదైన శైలిలో చాకచక్యంగా దొంగలను పట్టుకున్నారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతినగర్​లో జరిగింది. పూర్తి వివరాలు..

Arrest of robbers
ప్రకాశం జిల్లా పోలీసులు

పోలీసులమని బెదిరించి... చివరికి..

అతనో కారు డ్రైవర్‌. బంగారు వ్యాపారైన యజమాని వద్ద ఎనిమిది నెలలుగా పనిచేస్తున్నాడు. తరచూ రూ.లక్షల నగదును యజమాని వ్యాపార రీత్యా తీసుకెళ్లడాన్ని గమనించాడు. తన సమీప బంధువైన పాత నేరస్థుడి మాటలు విని యజమాని సొమ్మే కొట్టేయాలని భావించాడు. వీరికి ఓ కానిస్టేబుల్‌, వాలంటీర్‌, మరొకరు జత కలిసి ప్రణాళిక ప్రకారం రూ.50 లక్షలు దోచేశారు. గుడ్లూరు పీఎస్‌ పరిధిలోని శాంతినగర్‌ వద్ద ఆగస్టు 31న జరిగిన ఈ దోపిడీ కేసును కందుకూరు పోలీసులు ఛేధించారు. వివరాలను సోమవారం ఒంగోలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ మలికా గార్గ్‌ వెల్లడించారు.

ఏం జరిగింది...? ఎలా జరిగింది...?

గత నెల 31న నెల్లూరు జిల్లాకు చెందిన చిరంజీవి, అతని మిత్రుడు, బంగారు వర్తకులతో కలిసి కొంత నగదుతో బంగారు ఆభరణాలు కొనేందుకు విజయవాడ కారులో బయలుదేరారు. ప్రకాశం జిల్లా శాంతినగర్​కు వచ్చే సమయానికి వీరు వెళ్తున్న కారును పోలీసులమని చెప్పి అడ్డగించారు. వ్యాపారులను ప్రశ్నించి, మీ దగ్గర లెక్కలు చూపని డబ్బు ఉన్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది.. మిమ్మల్ని ప్రశ్నించాలి.. డీఎస్పీ గారు పిలుస్తున్నారు..పోలీస్ స్టేషన్​కు వెళదామంటూ వారిని నమ్మించారు. కారులో మాటల్లోకి దింపి, నల్లడబ్బు కాబట్టి కేసు పెడితే చాలా ఇబ్బందులు వస్తాయని, కేసు లేకుండా చేస్తామని రూ.25 లక్షలు ఇవ్వాలని బేరం పెట్టారు. డబ్బు ఇస్తుండగా, నగదు సంచిని అపహరించుకుపోయారు. కత్తితో బెదిరించారు. ఆ సంచిలో రూ.50 లక్షలు నగదు ఉంది.. అయితే దొంగలు వెళ్తూ..వెళ్తూ వ్యాపారుల వద్ద లాకున్న వారి సెల్​ఫోన్లను వారికే ఇచ్చి వెళ్లిపోయారు. ఈ పనే వారిని పోలీసులకు పట్టించింది. వ్యాపారులు సమయస్ఫూర్తితో నిందితులు పారిపోయిన కారు ఫోటో తీశారు. ఈ సంఘటన జరిగిన మూడు రోజుల తరువాత అంటే.. ఈ నెల 3న బంగారు వ్యాపారులు గుడ్లూరు పోలీస్​స్టేషన్​కు వచ్చి ఫిర్యాదు చేసి.. కారు ఫొటోలను అందజేశారు. కారు నెంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. సాంకేతికతను వినియోగించే కారు ఆచూకీ కనుగొన్నట్లు ప్రకాశం ఎస్పీ మలికా గార్గ్ వివరించారు. నిందితులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.47 లక్షల నగదు, రెండు కార్లు, కత్తిని స్వాధీనం చేసుకున్నారు.

నిందుతులెవరు..?

ఈ చోరీలో ప్రధాన నిందితులు తాతా నాగరాజు, వ్యాపారి వద్ద పని చేస్తున్న కార్ డ్రైవర్, ఒక కానిస్టేబుల్ సహా వీరికి సహకరించిన వారిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. పథకం ప్రకారం తాతా నాగరాజుకు డ్రైవర్ శ్రీనివాస్ తన యజమాని విజయవాడ ప్రయాణం గురించి సమాచారం అందించాడు.. నాగరాజు కానిస్టేబుల్​గా పనిచేస్తున్న సుధాకర్​కు సమాచారం ఇచ్చి నెల్లూరుకు పిలిపించుకున్నాడు. చిరంజీవి నెల్లూరు నుంచి బయలుదేరినప్పుడు నిందితులు కూడా రెండు కార్లలో వెంబడించి, శాంతినగర్ వద్ద అడ్డుకున్నారు.

ఇదీ చదవండి: Cheating: 30 మంది యువతులను మోసం చేసి.. రూ.కోట్లలో నగదు కాజేసి

Last Updated : Sep 7, 2021, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.