ETV Bharat / state

ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల కోరిక నెరవేరేనా?

author img

By

Published : Nov 20, 2020, 9:14 PM IST

ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల కోరికైన రామాయపట్నం పోర్టు నిర్మాణంపై అనేక అనుమానాలు నెలకొంటున్నాయి. ప్రభుత్వం రోజుకో ప్రతిపాదనను ముందుకు తెస్తుండడం జిల్లా వాసులను గందరగోళానికి గురి చేస్తోంది. తాజాగా జిల్లాలో పోర్టు పరిధిని తగ్గించడమే కాక... పోర్టు ఆధారిత పరిశ్రమలకు నెల్లూరు జిల్లాలో భూములు సేకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫలితంగా ప్రకాశం జిల్లా వాసుల్లో ఆందోళన మరింత పెరిగింది.

ramayapatnam port
ramayapatnam port

ప్రకాశం జిల్లా ప్రజల చిరకాల కోరిక పూర్తయ్యేనా?

ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టు నిర్మాంపై నీలినీడలు అలుముకుంటున్నాయి. పోర్టు సామర్థ్యం, చుట్టూ పరిశ్రమల ఏర్పాటు విషయంలో ప్రభుత్వ చర్యలు కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. రాష్ట్ర పునర్విభజనలో భాగంగా ప్రకాశం జిల్లా రామాయపట్నంలో ఓడరేవు నిర్మిస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. రామాయపట్నంలో ఉన్న సహజసిద్ధమైన పరిస్థితులు పోర్టు నిర్మాణానికి అనువుగా ఉంటాయని కూడా నివేదికలు స్పష్టం చేశాయి. గత ప్రభుత్వం హయాంలో శంకుస్థాపన కార్యక్రమం కూడా పూర్తైంది. ప్రాథమికంగా 5వేల 400 ఎకరాల భూమి అవసరం ఉండగా, రెండువేల ఎకరాలు మాత్రమే ప్రభుత్వ భూమి ఉంది. మిగిలిన భూమి సేకరించడానికి కూడా ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు.

పక్క జిల్లాలో భూసేకరణ!

జిల్లాలో ఆక్వా, గ్రానైట్‌ ఆధారిత పరిశ్రమలు, పొగాకు, మిరప, పత్తి వంటి వాణిజ్య పంటలకు అనుకూలంగా ఉండటం వల్ల... పోర్టు నిర్మాణంతో దాని పరిసరాల్లో పరిశ్రమలు ఏర్పడి జిల్లా వాసులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అంతా ఆశతో ఉన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత పోర్టు నిర్మాణానికి దాదాపు సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ పోర్టు సామర్థ్యం, చుట్టూ పరిశ్రమల ఏర్పాటు విషయంలో కొత్త కొర్రీలు ఏర్పడుతున్నాయి. పోర్టు కోసమే 5400 ఎకరాలు సేకరించాల్సి ఉండగా ప్రస్తుతానికి 802 ఎకరాలు తొలివిడత సేకరించేందుకు తాజా ప్రతిపాదన తెచ్చారు. పరిశ్రమల కోసం దాదాపు 6వేల ఎకరాలు అవసరం కాగా నెల్లూరు జిల్లా కావలి ప్రాంతంలో భూసేకరణకు సిద్ధమవుతున్నారు. దీనివల్ల ప్రకాశం జిల్లాలో పోర్టు విషయంలో ఉద్యమాలు చేసిన వారిలో ఆందోళన నెలకొంది.

చొరవ చూపాలి

పోర్టు నిర్మాణం విషయంలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా చూడాలని.... ఇందుకు జిల్లాకు చెందిన మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి పరిస్థితిని వివరించి, పోర్టుతో పాటు దాని ఆధారిత అభివృద్ధి పరిశ్రమలు ప్రకాశం జిల్లాలోనే ఉండేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి

'ఆగస్టు 31 నాటికి వెలిగొండ పనులు పూర్తవ్వాలి'

భైరవకోన... 'ప్రకాశం'లోని పర్యాటక కేంద్రాల్లో బాహుబలి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.