ETV Bharat / state

మతి స్థిమితం లేని యువతిపై అత్యాచారం

author img

By

Published : Dec 14, 2019, 11:58 AM IST

Rape on a young woman at thripuranthakam
మతి స్థిమితం లేని యువతిపై అత్యాచారం

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అత్యాచార ఘటనలు మరవకముందే... రాష్ట్రంలో మరోకటి జరిగింది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో మతిస్థిమితం లేని యువతిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.

మతి స్థిమితం లేని యువతిపై అత్యాచారం

మతి స్థిమితం లేని యువతిపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం రాజుపాలెంలో ఈ దారుణం జరిగింది. రాత్రి ఇంట్లో నిద్రపోతున్న యువతిపై అత్యాచారం చేసినట్లు బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. యువతి కేకలు వేయగా... బంధువులు నిందితున్ని పట్టుకున్నారు. అప్రమత్తమైన నిందితుడు అక్కడినుంచి తప్పించుకున్నాడు. బాధితురాలి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల నిమిత్తం యువతిని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

ఇదీ చదవండి:

కన్నకూతురిని కాటేసిన తండ్రికి యావజ్జీవ శిక్ష

Intro:AP_ONG_81_14_ATYACHAARAM_AVB_AP10071

కంట్రిబ్యూటర్: వి. శ్రీనువాసులు మార్కాపురం ప్రకాశం జిల్లా.

యాంకర్: జరిగిన అత్యాచారాలు మారువకముందే ప్రకాశం జిల్లాలో మరో అత్యాచారానికి ఒడిగట్టాడు...ఓ కామాంధుడు. ఏకంగా మతిస్థిమితం లేని యువతి పైనే ఈ ఆరాచకానికి పాల్పడ్డాడు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం రాజుపాలెం లో రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న యువతి ఆమె ఇంటి వద్దకు అత్యాచారం చేసినట్లు తల్లిదండ్రులు తెలిపారు. యువతి అరవడం బంధువులు నిందితుణ్ణి పట్టుకున్నారు. అప్రమత్తమైన కరుణాకర్ రెడ్డి అక్కడినుండి తప్పించుకున్నాడు. వెంటనే బంధువులు త్రిపురాంతకం పోలీసు స్టేషన్ లో పిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు కరుణాకర్ రెడ్డి ని అదుపులోకి తీసుకున్నారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం మార్కాపురం ప్రభుత్వ వైద్యశాల కు తరలించారు.


Body:అత్యాచారం.


Conclusion:8008019243.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.