ETV Bharat / state

ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతల అవస్థలు..

author img

By

Published : Mar 18, 2023, 11:48 AM IST

Updated : Mar 18, 2023, 12:30 PM IST

Paddy Farmers Problems: మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు అకాల వర్షాలు.. ధాన్యం రైతుల ఆశల్ని ముంచేస్తున్నాయి. ఇప్పటికే పంటకొనే నాథుడు లేక అవస్థలు పడుతున్న అన్న దాతలను ఈ వర్షాలు మరింత కష్టాల పాలు చేశాయి. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసి రంగు మారుతుండటంతో లబోదిబోమంటున్నారు. ఇదే అదనుగా మిల్లర్లు తేమ పేరిట తక్కువ ధరకే పంటను కొనుగోలు చేస్తూ ప్రకాశం జిల్లా రైతుల శ్రమను దోచుకుంటున్నారు

Etv Bharat
Etv Bharat

ధాన్యాన్ని కాపాడుకునేందుకు అన్నదాతల అవస్థలు..

Paddy Farmers Problems : ప్రకాశం జిల్లా ఒంగోలు, కొత్తపట్నం మండలాల్లో వరి రైతుల పరిస్థితి ధైన్యంగా మారింది. పండించిన పంటను అమ్ముకునేందుకు అష్టకష్టాలు పడుతున్న రైతులకు అకాల వర్షాలు ఇక్కట్లకు గురిచేస్తున్నాయి. జిల్లాలో వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉండటం వల్ల అటు ఖరీఫ్‌కు, ఇటు రబీకి మధ్యలో వరి సాగు చేస్తారు. మార్చి నెలలో కోతలు పూర్తి చేసుకొని పంట అమ్మకానికి సిధ్ధం చేస్తారు. అయితే ప్రభుత్వం తరుపున కొనుగోలు చేయాలంటే ఈ క్రాప్‌ చేసుకోవాలి. రైతులంతా ఈ క్రాప్‌ చేసుకొని పండిన పంటను కొనుగోలు చేయాలని రైతు భరోసా కేంద్రాలను సంప్రదిస్తే పంట ఏ సీజన్‌ ది అనే ప్రశ్న తలెత్తింది. రబీ పంటకు ఇంకా సమయం ఉన్నందున కొనుగోళ్లు అప్పుడే చేస్తామని సచివాలయ సిబ్బంది చెప్పడంతో ఏం చేయాలో తెలీని పరిస్థితి నెలకొంది. కోతకు వచ్చిన పంటను యంత్రాలతో కోతలు పూర్తి చేసి, ధాన్యాన్ని అమ్ముకోడానికి సిద్దం చేసుకున్నా కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైతుల శ్రమను దోచుకుంటున్న మిల్లర్లు : ప్రభుత్వ కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడంతో పంటను ఎక్కడ నిల్వ చేయాలో తెలీని పరిస్థితి నెలకొంది. దీంతో ఇదే సరైన సమయం భావించి కొంత మంది మిల్లర్లు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతుల శ్రమను దోచుకుంటున్నారు. బస్తా వేయి నుంచి 11 వందల రూపాయలకు మించి కొనుగోలు చేయడంలేదు. పైగా తేమ, తరుగు అని చెప్పి బస్తాకు మూడు కిలోలు చొప్పున కోత విధిస్తున్నారని రైతులు దీనంగా చెబుతున్నారు.. పోనీ ప్రయివేట్‌ వర్తకులు వచ్చి పోటీ పడి కొనుగోలు చేసినా, కొంత గిట్టుబాటు అయ్యేది. కానీ మిల్లర్లు ఆ వ్యాపారులను రానివ్వడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్క రోజు వ్యవధిలో మారిపోయిన ధాన్యం విలువ : ఈ పరిస్థితుల్లో అకాల వర్షాలు కొంపముంచుతోంది. కల్లాల్లో పోసిన ధాన్యం తడిసి పోకుండా రైతులు నానా అవస్థలు పడుతున్నాడు. అప్పటికే తడిచి ధాన్యం రంగు మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క రోజు వ్యవధిలో ధాన్యం విలువ మారిపోయిందని, వర్షం వల్ల ఎకరాకు పది వేల రూపాయల వరకూ నష్టం వాటిల్లుతుందని పేర్కొంటున్నారు.

రైతుల ఆవేదన : రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం వరి పంటను కొనుగోలు చేసి ఆదుకోవాలని ప్రకాశం జిల్లా ధాన్యం రైతులు వేడుకుంటున్నారు.

రాత్రి వర్షం పడి ధాన్యం మొత్తం తడిసిపోయాయి. ఇప్పుడు వచ్చి ఏమీ చేసిన ఉపయోగం లేదు. ఆవిరి పట్టి పోయాయి. ఎట్టా అమ్మేదని అల్లాడుతున్నాం. రేటు పదిహేను వందల దాకా ఉంది.. కానీ పదకొండు వందలకు ఇస్తారా వెయ్యికి ఇస్తారా అని అడుగుతున్నారు. వారం అయ్యింది నల్లగా, తెల్లగా ఉన్నాయని ఎవరూ రావడం లేదు.. ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు. - నర్సింహులు, ప్రకాశం జిల్లా

ఇవీ చదవండి

Last Updated : Mar 18, 2023, 12:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.