ETV Bharat / state

జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల ఫ్లెక్సీ.. చర్చనీయాంశమవుతున్న కామెంట్

author img

By

Published : Dec 29, 2020, 10:38 AM IST

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో జూనియర్​ ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ.. చర్చనీయాంశమైంది.

ntr cm flex
ఆసక్తికరంగా జూనియర్​ ఎన్​టీఆర్ ప్లెక్సీ... ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి అంటూ..

ప్రకాశం జిల్లాలో యర్రగొండపాలెంలో సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు.. నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో తెలుగుదేశం పార్టీ నేతల చిత్రపటాలకూ చోటు కల్పించారు.

అయితే.. ఆ ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ ఫొటో కింద.. ఏపీ నెక్స్ట్ సీఎం.. అని ఓ కామెంట్ కూడా ప్రింట్ చేసి ఉండడం.. చర్చనీయాంశమైంది. ఈ ఫ్లెక్సీ ఎవరు ఏర్పాటు చేశారన్న విషయమై.. పట్టణంలో జోరుగా చర్చ జరుగుతోంది.

ఇదీ చదవండి:

భక్త సందోహం.. మార్గశిర శుద్ధ త్రయోదశి హనుమత్ వ్రతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.