ETV Bharat / state

YSRCP Overaction: ఎర్రగొండపాలెంలో వైసీపీ రాళ్ల దాడి.. ఎన్​ఎస్​జీ కమాండెంట్​కు గాయాలు

author img

By

Published : Apr 21, 2023, 10:06 PM IST

Updated : Apr 22, 2023, 6:17 AM IST

YSRCP Overaction: ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబు పర్యటన వేళ.. వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడింది. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ శ్రేణులు చంద్రబాబు వాహనంపై రాళ్లదాడి చేశారు. ఎన్​ఎస్​జీ సిబ్బంది బుల్లెట్​ ఫ్రూవ్​ జాకెట్లు అడ్డుపెట్టి చంద్రబాబును రక్షించారు. ఈ దాడిలో ఎన్​ఎస్​జీ కమాండెంట్​ సంతోష్​కుమార్​ గాయపడ్డారు. అతని గాయానికి మూడు కుట్లు పడ్డాయి.

nsg commondant injured in ycp stone pelting
ycp stone pelting on chandrababu convoy

NSG Commandant injured in YCP stone pelting: ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. చంద్రబాబు పర్యటించకుండా శతవిధాలా ప్రయత్నించారు. చంద్రబాబు రోడ్​షో నిర్వహిస్తున్న సమయంలో నల్లబెలూన్లతో నిరసనలు తెలిపారు. రోడ్లపైకి వచ్చి రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా చంద్రబాబుపై వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వాయి. రాళ్ల దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలు గాయాలు అయ్యాయి. ఎన్​ఎస్​జీ కమాండోలు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు అడ్డుగా పెట్టి చంద్రబాబును రక్షించాయి. రాళ్లు రువ్వటంపై చంద్రబాబు వైసీపీ శ్రేణుల్ని గట్టిగా హెచ్చరించారు.

ఈ దాడిలో చంద్రబాబు భద్రతలోని ఎన్ఎస్​జి కమాండెంట్​ సంతోష్ కుమార్ తలకు గాయం అయ్యింది. వైసీపీ శ్రేణులు కాన్వాయ్ పైకి రాళ్ళు రువ్విన సమయంలో గాయం అయ్యింది. దాడి సమయంలో చంద్రబాబుకు రక్షణగా ఎన్ఎస్​జి కమాండోలు నిలిచారు. పోలీసులు వైసీపీ కార్యకర్తలను చంద్రబాబు కాన్వాయ్ వరకు రానివ్వటంతో ఎన్ఎస్​జి కమాండోలు గోడలా అడ్డుగా నిలిచారు.ఈ సమయంలో వైసీపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు. ఎన్ఎస్​జి కమాండెంట్​ సంతోష్ కుమార్ తలకు గాయం అయ్యింది. మూడు కుట్లు వేసి వైద్యులు కట్టు కట్టారు. ఎన్ఎస్ జి బృందం అడ్డుగా లేకపోతే చంద్రబాబుపై రాళ్లు పడేవి అని భద్రతా సిబ్బంది తెలిపారు. సంఘటనను ఎన్ఎస్​జీ బృందాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి.

ఇదిలావుండగా వైసీపీ నేతలు, కార్యకర్తలకు మంత్రి క్యాంప్ ఆఫీస్ ముందే చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఇరు పక్షాలను చెదరకొట్టేందుకు పోలీసులు తెలుగుదేశం నేతలను కార్యకర్తలను తోసేశారు. పోలీసుల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన జోలికి వస్తే ఖబడ్దార్ జాగ్రత్త అంటూ మంత్రికి, మంత్రి అనుచరులను చంద్రబాబు హెచ్చరించారు. తీవ్ర ఉద్ధృతల మధ్య చంద్రబాబు కాన్వాయ్ మంత్రి క్యాంప్ ఆఫీస్ దాటింది. రాళ్ల దాడికి పాల్పడిన వారిని వదిలేసి టీడీపీ కార్యకర్తలపై పోలీసుల లాఠీ ఛార్జ్ చేయటంపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సురేష్.. యర్రగొండపాలెం ఎవడబ్బ జాగీర్ అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతకు పర్యటించే హక్కు లేదా అని నిలదీశారు. వైసీపీ అల్లరి మూకలు ఖబడ్డార్...అధికారం ఉంది కదా అని పిచ్చి పిచ్చి వేషాలేస్తే తాట తీస్తామని హెచ్చరించారు.

ఎన్ఎస్​జి  కమాండెంట్​ సంతోష్ కుమార్​ను పరామర్శించిన చంద్రబాబు
ఎన్ఎస్​జి కమాండెంట్​ సంతోష్ కుమార్​ను పరామర్శించిన చంద్రబాబు

వైసీపీ రాళ్లదాడిలో గాయపడిన ఎన్ఎస్​జి కమాండెంట్​ సంతోష్ కుమార్​ను చంద్రబాబు పరామర్శించారు. సంతోష్​ కుమార్​ చికిత్స వివరాలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Apr 22, 2023, 6:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.