ETV Bharat / state

లివర్ వ్యాధిగ్రస్తుడికి రూ.10 లక్షల ఆర్థిక సహాయం

author img

By

Published : Apr 30, 2021, 7:47 AM IST

Updated : Apr 30, 2021, 9:04 AM IST

లివర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా 10లక్షల ఆర్ధిక సహాయాన్ని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అందజేశారు.

 Rs. 10 lakhs to a liver patient from the CM Assistance Fund
Rs. 10 lakhs to a liver patient from the CM Assistance Fund

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంకు చెందిన షేక్ జానీభాషా అనారోగ్యంతో హైదరాబాద్​లోని యశోద ఆస్రత్రిలో చేరారు. లివర్ సమస్య కావటంతో ఖర్చులు అధికంగా అవుతాయని వైద్యులు తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి సురేష్ దృష్టికి తీసుకు రావటంతో వెంటనే స్పందించిన ఆయన.. సీఎం సహాయనిధి నుంచి 10 లక్షల రూపాయలు మంజూరు చేయించారు. గురువారం బాధిత కుటుంబ సభ్యులకు గుంటూరు క్యాంపు కార్యాలయంలో మంత్రి సురేష్ అందజేశారు. తమకు సహాయం చేసిన మంత్రికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

ఇదీ చదవండి

'కొవిడ్ కేసులు చూడమని బోర్టులు పెట్టడం సరికాదు'

Last Updated :Apr 30, 2021, 9:04 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.