ETV Bharat / state

ఆక్వా రంగానికి ప్రోత్సాహం కరవు.. ఖాళీగా చెరువులు

author img

By

Published : Apr 7, 2023, 2:21 PM IST

Shrimp Hatchery: ప్రభుత్వ నిర్లక్ష్య ఫలితం.. ఆక్వా రంగంతో పాటు దానితో ముడిపడి ఉన్న ఇతర పరిశ్రమలూ క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి. ఇటీవల రొయ్యల సాగు గణనీయంగా పడిపోయింది. దాదాపు 90 శాతం చెరువులు ఖాళీగా మారాయి. సాగు లేకపోవడం వల్ల హేచరీల పరిస్థితి కూడా దారుణంగా మారింది. తీరం వెంట ఉన్న హేచరీలు చాలా వరకు మూత పడ్డాయి. ఉన్నవి ఉత్పత్తిని తగ్గించేశాయి. నిర్వహణ భారంగా మారి ఈ పరిస్థితి నెలకొందని హేచరీ నిర్వాహకులు చెబుతున్నారు.

Etv Bharat
Etv Bharat

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో క్లిష్ట పరిస్థితుల్లో ఆక్వా రంగం, అనుబంధ పరిశ్రమలు

Shrimp Hatchery : ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 102 కిలో మీటర్ల తీర ప్రాంతంలో వందల సంఖ్యలో హేచరీలున్నాయి. రైతులు ఇక్కడ ఉత్పత్తయ్యే రొయ్య పిల్లల్ని కొనుగోలు చేసి తమ చెరువుల్లో సాగు చేస్తారు. ప్రైవేటు సంస్థలే రొయ్య పిల్లల్ని ఉత్పత్తి చేస్తాయి. నాణ్యమైన తల్లి రొయ్యల్ని ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడి హేచరీల్లో క్రాసింగ్ చేయించి పిల్లల్ని ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియ అంతా చాలా క్లిష్ట తరంగా ఉంటుంది. ఉప్పు నీటిలో ఉత్పత్తి చేసే విధానంలో విద్యుత్ వినియోగం కీలకంగా ఉంటుంది.

హేచరీల్లో ప్రతి నిమిషం విద్యుత్ : విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోవడంతో హేచరీల నిర్వహణ భారంగా మారింది. నాలుగు సంవత్సరాల క్రితం యూనిట్‌ ధర 4 రూపాయల 30 పైసలుగా ఉన్న విద్యుత్ ఛార్జీలు ఇప్పుడు సర్‌ఛార్జితో కలిపి 7 రూపాయల 30 పైసల వరకూ పెరిగాయి. హేచరీల్లో 24 గంటలూ విద్యుత్‌ వినియోగం ఉంటుంది. ఒక వేళ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడితే క్షణం ఆలస్యం కాకుండా జనరేటర్లు వేయాలి. ఇలాంటి ఇబ్బందుల కారణంగా హేచరీల నిర్వహణ కష్టంగా మారిందని నిర్వాహకులు చెబుతున్నారు.

ఖాళీగా రొయ్యల చెరువులు : వ్యాపారమైనా సజావుగా సాగితే నిర్వహణ భారం పెరిగినా మనుగడ సాగించే అవకాశం ఉండేది. కానీ రొయ్యల ధరలు పడిపోవడం, విదేశాలకు ఎగుమతులు మందగింటడం వల్ల హేచరీలకు వ్యాపారం బాగా పడిపోయింది. రెండు నెలలుగా దాదాపు రొయ్యల చెరువులు ఖాళీ అయ్యాయి. సాగు చేయకపోవడం వల్ల రొయ్య పిల్లలను కొనుగోలు చేయడం లేదు. విక్రయాలు లేక హేచరీల్లో ఉత్పత్తిని తగ్గించారు.

హేచరీలకు మనుగడ? : ఇప్పుడు కేవలం 10 శాతం మేర మాత్రమే ఉత్పత్తి జరుగుతోంది. చాలా హేచరీలు మూత పడ్డాయి. కార్మికులకూ పని లేకుండా పోయింది. హేచరీలకు అనుమతుల విషయంలోనూ ప్రభుత్వ విధానాలు లోపభూయిష్టంగా ఉన్నాయని నిర్వాహకులు అంటున్నారు. ప్రభుత్వాలు ఆక్వా సాగును ప్రోత్సహిస్తేనే హేచరీలకు మనుగడ ఉంటుందని నిర్వాహకులు కోరుతున్నారు.

" గతంలో ఈ పరిశ్రమ చాలా తక్కువగా ఉండేది. తరువాత రన్నింగ్​లోకి వచ్చింది. హేచరీస్ కూడా ఎక్కవగా ఉండేవి. విద్యుత్ చార్జీలు పెరగడం వల్ల రొయ్యల పెంపకం తగ్గించేశారు. హేచరీస్ రన్ చేయడం కష్టతరం అయ్యింది. కరెంట్ చార్జీలు గతంలో కంటే ఎక్కవగా పెరిగాయి. రకారకాలు సంస్థలు ఏర్పాటు చేసి అందరి దగ్గర అనుమతులు తీసుకోవాలని మమల్ని ఇబ్బంది పెడుతున్నారు. " - సత్యనారాయణరాజు, హేచరీస్‌ సంఘం అధ్యక్షుడు

"హేచరీల కోసం వివిధ రకాల అనుమతులు తీసుకోవాల్సి వస్తుంది. సెంట్రల్ యాక్ట్ తీసుకువస్తే మేము ఒకే దగ్గర నుంచి అన్ని అనుమతులు తీసుకోవడం ఉపయోగకరంగా ఉటుంది. " - మోహన్‌, హేచరీ నిర్వాహకుడు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.