ETV Bharat / state

Disha App: దిశ యాప్ సహాయంతో.. యువతిని కాపాడిన పోలీసులు!

author img

By

Published : Jul 26, 2021, 2:19 PM IST

ఆపదలో ఉన్న యువతిని.. దిశ యాప్ కాపాడింది. ఉద్యోగం నిమిత్తం తన వేరే ఊరికి వెళ్లాలనుకున్న యువతికి.. తాను ప్రయాణిస్తున్న ఆటో డ్రైవర్ ప్రవర్తనపై అనుమానం కలిగింది. వెంటనే బాధిత యువతి తన సోదరికి విషయం తెలియజేసింది. తను దిశ యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించింది. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. యువతికి రక్షణ కల్పించారు. ఆమె ఉండే హాస్టల్​లో సురక్షితంగా దిగబెట్టారు. భద్రత కోసం తాము ఉన్నామని భరోసా కల్పించారు. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది.

21years old young girl was saved by police through disha app at nellore
దిశ యాప్ సహాయంతో యువతిని కాపాడిన పోలీసులు

నెల్లూరు జిల్లా పోలీసులు.. ఆపదలో ఉన్న ఓ యువతిని దిశ (disha) యాప్ సహాయంతో.. కాపాడారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన 21ఏళ్ల యువతి.. శ్రీ సిటీలో ఉద్యోగం చేస్తోంది. సొంతూరు నుంచి శ్రీసిటీకి వెళ్లేందుకు రాత్రి 9.30 గంటలకు ఆ యువతి నాయుడుపేట బస్ స్టాండుకు వచ్చింది. అక్కడి నుంచి బస్సులు లేకపోవడంతో ఆటోలో సుళ్లూరుపేట వెళ్లేందుకు పయనమైంది. ఆటోలో వెళ్తుండగా డ్రైవర్ ప్రవర్తనపై ఆమెకు అనుమానం కలిగింది.

దారిలోనే నేలబల్లి హైవేపై ఆ యువతి ఆటో దిగేసింది. జాతీయ రహదారిపై రాత్రి సమయంలో ఎటు పోవాలో దిక్కుతోచని ఆ యువతి... సోదరికి ఫోన్​లో సమాచారమిచ్చింది. దీంతో కంగారుపడ్డ యువతి సోదరి.. దిశ యాప్ ద్వారా వెంటనే పోలీసులకు సమాచారం అందించింది. నిమిషాల వ్యవధిలో వారు.. ఆ యువతి వద్దకు చేరుకున్నారు. పోలీసులే సూళ్లూరుపేటలోని హాస్టల్​లో క్షేమంగా దింపారు.

సమాచారం వచ్చిన వెంటనే.. ఆపదలో ఉన్న యువతిని నిమిషాల వ్యవధిలో రక్షించిన పోలీసులను... సౌత్‌ కోస్టల్‌ డీఐజీ త్రివిక్రమ వర్మ అభినందించి రివార్డులు అందించారు. మహిళలందరూ దిశ యాప్​ను డౌన్​లోడ్ చేసుకోవాలని డీఐజీ కోరారు.

ఇదీ చదవండి:

FLOOD: గోదావరి నదికి పోటెత్తిన వరద.. నీటిలోనే లోతట్టు ప్రాంతాలు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.