అంతమొందించేందుకు కుట్ర.. ఎమ్మెల్యే ఆనం సంచలన వ్యాఖ్యలు

author img

By

Published : Jan 31, 2023, 4:18 PM IST

Anam Ramanaraya Reddy on removing gun men

Anam Ramanarayana Reddy sensational comments: నాలుగేళ్లకే ప్రభుత్వ పనితీరుపై రాష్ట్ర ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని ఆనం రామనారాయణరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భద్రత తొలగింపుపై స్పందించిన ఆనం.. భద్రతను ఎలా తొలగిస్తారంటూ ప్రశ్నించారు. తన ఫోన్లు రెండున్నరేళ్లుగా ట్యాపింగ్‌ అవుతున్నాయని ఆనం ఆరోపించారు.

Anam Ramanaraya Reddy on removing gunmen: తనకు కేటాయించిన భద్రత గన్​మెన్​లను తొలగించడంపై వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను భౌతికంగా అంతమొందించేందుకు కుట్ర పన్నుతున్నట్లు అనుమానంతో పాటు.. ఆందోళన వ్యక్తం చేశారు. నక్సలైట్ల ప్రభావితం కలిగిన.. కేంద్రం నిర్ధారించిన ఐదు పోలీస్ స్టేషన్​లు ఉన్నాయని, అలాంటి నక్సలైట్ల ప్రభావిత ప్రాంతాల్లో భద్రత ఎలా తొలగిస్తారంటూ ఆనం రామనారాయణ రెడ్డి ప్రశ్నించారు. తాను 1983 నుంచి రాజకీయాల్లో ఉన్నానని.. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఎదురు కాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

భద్రత విషయంలో కనీసం తనకు సమాచారం ఇవ్వకుండానే.. ఇద్దరు గన్​మెన్లను ఏకపక్షంగా తొలగించారని మండిపడ్డారు. గతంలో నక్సలైట్లు, ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లు ప్రభావం కలిగిన ప్రాంతం వెంకటగిరి అనీ.. గత మూడు నెలల క్రితం కలువాయి మండలంలో ఎర్రచందనం స్మగ్లర్లతో చేతులు కలిపిన ఓ యువకుడిని స్మగ్లర్లు దారుణంగా హత్య చేసినట్లు ఆనం తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో జిల్లా చరిత్రలో ఇలా గన్​మెన్లను తొలగించిన పరిస్థితి ఎప్పుడూ లేదని ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు.

నేరుగా.. రాజకీయంగా ఎదుర్కోలేక.. భౌతికంగా అంతమొందించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆనం ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల వెంకటగిరిలో ఓ కౌన్సిలర్ ఏర్పాటు చేసిన తన కటౌట్​ను తగలబెట్టారని తెలిపారు. ఇక తనను అంతమొందించడం ఒక్కటే మిగిలి ఉందని వెల్లడించారు. తనపై అనేక కుట్రలు పన్నుతున్నారన్న అనుమానాలు ఉన్నాయని తెలిపిన ఆయన.. తాను ఆరుసార్లు శాసనసభ్యులుగా, మంత్రిగా.. తొమ్మిది సార్లు ఎన్నికల్లో పోటీ చేసిన రాజకీయ చరిత్ర ఉన్నట్లు పేర్కొన్నారు. తన భద్రత తొలగింపుపై ప్రభుత్వ పెద్దలే సమాధానం చెప్పాలని ఆయన వెల్లడించారు. తన ఫోన్లు రెండున్నరేళ్లుగా ఫోన్ ట్యాపింగ్ అవుతూ ఉన్నాయని ఆనం సంచలనం కామెంట్స్ చేశారు.

నెల్లూరులో మాఫియా చెలరేగి పోతోందని ఆరోపణలు చేశారు. తాను రెండేళ్ల క్రితం బెటాలియన్ ఫంక్షన్​లో మాట్లాడిన నాటి నుంచి తన ఫోన్ ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని వెల్లడించారు. తన ఫోన్ ట్యాపింగ్ అయిన విషయంపై ఆన్ రికార్డుగా చెబుతున్నట్లు ఆనం వెల్లడించారు.

భద్రత తొలగింపుపై ఆనం రామనారాయణరెడ్డి

'భద్రత విషయంలో కనీస సమాచారం లేకుండా ఇద్దరు గన్​మెన్లను ఏకపక్షంగా తొలగించారు. గతంలో నక్సలైట్లు, ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లు ప్రభావం కలిగిన ప్రాంతం వెంకటగిరి. నెల్లూరు జిల్లా చరిత్రలో ఇలా గన్​మెన్లను తొలగించిన సంఘటన పరిస్థితి ఎప్పుడూ లేదు. నేరుగా..రాజకీయంగా ఎదుర్కోలేక ..భౌతికంగా అంతమొందించేందుకు కుట్రలు జరుగుతున్నాయి. ఇటీవల వెంకటగిరిలో ఓ కౌన్సిలర్ ఏర్పాటు చేసిన తన కటౌటును తగలబెట్టారు. ఇక తనను అంతమొందించడం ఒక్కటే మిగిలి ఉంది. నాపై అనేక కుట్రలు పన్నుతున్నారన్న అనుమానాలు ఉన్నాయి. నా భద్రత తొలగింపుపై ప్రభుత్వ పెద్దలే సమాధానం చెప్పాలి. నా ఫోన్లు రెండున్నరేళ్లుగా ఫోన్ ట్యాపింగ్ అవుతూ ఉన్నాయి.'- ఆనం రామనారాయణరెడ్డి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.