ETV Bharat / state

అప్పుల బాధతో యువ రైతు ఆత్మహత్య

author img

By

Published : Dec 22, 2019, 11:07 PM IST

​​​​​​​పండించిన పంట చేతికి రాక... అప్పుల బాధ అధికమవడంతో యువ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటికి పెద్ద దిక్కు కోల్పోయి.. రైతు కుటుంబం రోడ్డున పడింది.

Young farmer commits suicide with debt
అప్పుల భాదతో యువ రైతు ఆత్మహత్య

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం అగ్రహరం గ్రామంలో అప్పుల బాధతో యువ రైతు కాసా యల్లా రెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న రెండు ఎకరాల పోలంలో రెండేళ్ల క్రితం అప్పు చేసి మిరప పంట సాగు చేశాడు. వర్షాలు లేక పంట చేతికి రాలేదు. ఆ అప్పు తీర్చేందుకు మర్రిపాడు మండలంలో మరో నాలుగు ఎకరాలను కౌలుకు తీసుకుని మిరప పంట సాగు చేశాడు. ఇక్కడ అదే పరిస్థితి ఉండటంతో ఆరు లక్షల అప్పు చేశాడు. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో దిక్కుతోచని స్థితిలో పురుగులు మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతితో భార్య, ఇద్దరు కుమారులు వీధిన పడ్డారు. ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

అప్పుల భాదతో యువ రైతు ఆత్మహత్య

ఇవీ చూడండి...

ఉరేసుకుని యువతి ఆత్మహత్య.. కారణాలేంటి?

Intro:Ap_nlr_12_22_Raitu mruti_avb_ap_10061Body:పండించిన పంట వెతికందక అప్పుల భాద అదికమవడంతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చెసుకున్న యువ రైతు.

నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం అగ్రహరం గ్రామంలో అప్పులబాధతో యువ రైతు కాసా యల్లారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చెసుకోని మృతి చెందాడు.రైతు గ్రామంలో రెండు ఎకరాల పోలం వుంది రెండు సంవత్సారల క్రితం అప్పు చెసి మరి మిరప పంటను సాగు చెశాడు వర్షాభావ పరిస్దితి లెని కారణంగ పంట చెతికి రాలెదు ఆ అప్పు తీర్చెందుకు మర్రిపాడు మండలంలో మరో నాలుగు ఎకరాలు మిరప పంట సాగు చెశాడు పంట చెతికి అందక పోవడంతో ఆరు లక్షల మెర అప్పులకు తోడు వడ్డి భారమైంది తీవ్ర అప్పు పాలయ్యాడు అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చెయడముతో దిక్కుతోచని పరిస్దితిలో పురుగులు మందుతాగి ఆత్మహత్య చెసుకున్నాడు అతనికి బార్య ఇద్దరు కుమారులు వున్నారు రైతు మృతితో ఆ కుటుంబం వీది పడింది ప్రభుత్వమె వారిని ఆదుకోవాలని స్దానికు కోరుతున్నారు.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.