ETV Bharat / state

ఆ మాజీ మంత్రికి మూడు చోట్లు ఓటు హక్కు! తాజాగా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాతో వెలుగులోకి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 5, 2023, 9:52 PM IST

YCP MLA Anil Kumar Yadav voter identity controversy
YCP MLA Anil Kumar Yadav voter identity controversy

YCP MLA Anil Kumar Yadav voter identity controversy: మాజీ మంత్రి , వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్​కు ముడు చోట్ల ఓటు హక్కును కలిగి ఉన్నారు. తాజాగా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ ల్లో 111, 182, 191లో ఓటు హక్కు ఉంది. మూడు చోట్ల ఉన్న ఓటు యూనిక్ నెంబర్లు ఏహెచ్ యూ 0911628, ఏహెచ్ యూ 2984136, ఏహెచ్ యూ2937753 గా ఉన్నాయి.

YCP MLA Anil Kumar Yadav voter identity controversy: మాజీ మంత్రి , వైసీపీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్​ ముడు చోట్ల ఓటరుగా నమోదు అయినట్లు.. తాజాగా విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో వెలుగులోకి వచ్చింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్ ల్లో 111, 182, 191లో ఓటు హక్కు ఉంది. మూడు చోట్ల ఉన్న ఓటు యూనిక్ నెంబర్లు ఏహెచ్ యూ 0911628, ఏహెచ్ యూ 2984136, ఏహెచ్ యూ2937753 గా ఉన్నాయి. ఈ ఏడాది జనవరి 5న విడుదల చేసిన ఓటర్ల జాబితాలోనూ ఇవి ఉండగా , బీల్ వోలు వాటిని సవరించకుండానే ఆలానే ఉంచారు. గతంలో 107, 177, 185 పోలింగ్ బూత్ లు గా ఉన్నాయి. ఇప్పుడు అవి 111, 182, 191గా మారాయి... నెల్లూరు జిల్లాలో ఆదివారం నిర్వహించిన ఓటర్ల ముసాయిదాపై ప్రత్యేక శిబిరాలు ప్రహసనంగా మారాయి.

మొక్కుబడిగా ఓటరు జాబితా సవరణ - భారీగా అవకతవకలు, బీఎల్వోల తీరుపై ఓటర్ల అసహనం

బీఎల్వోల నిర్లక్ష్యం: నెల్లూరు నగరంలో చాలా పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 11గంటల వరకు బీఎల్వోలు అందుబాటులో లేరు. కొన్ని చోట్ల మధ్యాహ్నం తరువాత కనిపించలేదు. జిల్లాలో మొత్తం 228పోలింగ్ కేంద్రాలను పరిశీలించగా , దాదాపు 108 కేంద్రాల్లో ఉదయం 10.30గంటలు దాటినా బీఎల్వోలు రాలేదు. మధ్యాహ్నం గంటల తరువాత 153 కేంద్రాల్లో మాత్రమే బీఎల్వోలు కనిపించారు. వారిలో చాలా మంది సాయంత్రం 4గంటలకే వెళ్లిపోయారు. దుత్తలూరులోని పోలింగ్ బూత్ నంబర్ 108లో మొత్తం 913ఓట్లు ఉండగా వాటిలో 350 ఓట్ల ఇంటి చిరునామా (0) జీరో సంఖ్యతో ఉన్నాయి.

ఓట్ల తొలగింపునకు తాడేపల్లి కేంద్రంగా ఓ టీమ్‌ పని చేస్తోంది: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌ బాబు

41 ఓట్లకు జీరో డోర్ నంబరు: కందుకూరు నియోజకవర్గంలో మాచవరం జిల్లా పరిషత్ పాఠశాలలో ఐదు పోలింగ్ స్టేషన్లు ఉండగా మధ్యాహ్నం 3గంటలకు వెళ్తే తలుపులు వేసి ఉన్నాయి. పొదలకూరులోని పట్టాయిగుంట ప్రాంతంలోని 57వ నంబరు పోలింగ్ బూత్ లో మొత్తం 834ఓట్లు ఉండగా 22మంది చనిపోయిన వారి ఓట్లు ఉన్నాయి. అలాగే 41 ఓట్లకు జీరో డోర్ నంబరు ఉంది. విడవలూరులోని 225 పోలింగ్ బూత్ జాబితాలో 25ఏళ్ళ కిందట చనిపోయిన బుట్లజాలమ్మ పేరు , అదే పోలింగ్ బూత్ లో 20ఏళ్ళ కిందట చనిపోయిన మునియ్యపేర్లు జాబితాలో ఉన్నాయి.

వివిధ రూపాల్లో ఆరోపణలు ఇప్పటికే ఓట్ల జాబీతాలో చోటుచేసుకుంటున్న అక్రమాలపై టీడీపీ నేతలు వివిధ రూపాల్లో ఆరోపణలు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులను కలుస్తున్నారు. అయినప్పటికి సవరణ జాబితా విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు అనుకులమైన వారి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చడం.. వ్యతిరేకుల ఓటును తొలగించడం జరుగుతుందంటూ పలువురు ఆరోపిస్తున్నారు.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో చనిపోయిన వాళ్లకు ఓటు - బతికున్న వారికి వేటు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.