ETV Bharat / state

Nellore mayor నెల్లూరు మేయర్​పై దాడి అమానుషం..ఎస్టీ కమిషన్​కు ఫిర్యాదు చేస్తాం..

author img

By

Published : Apr 25, 2023, 6:32 PM IST

Protest over attacks on mayor: నెల్లూరు జిల్లాలో నిన్న కార్పోరేషన్ సమావేశంలో మేయర్ స్రవంతి​పై దాడి ఘటన మీద ఆమె నేడు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం గిరిజన సంఘాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. అధికారులు చర్యలు తీసుకోకపోతే జాతీయ ఎస్టీ కమిషన్​తో పాటుగ సుప్రీం కోర్టు వరకు వెళ్తామని హెచ్చరించాయి.

Etv Bharat
Etv Bharat

Mayor Sravathi met SP Tirumaleshwar Reddy: నిన్న నెల్లూరు కార్పోరేషన్ సమావేశంలో నగర మేయర్ స్రవంతికి అవమానం జరిగిందని. ముగ్గురు కార్పోరేటర్లు చీరపట్టుకుని లాగారని. ఎస్టీ మహిళాగా నన్ను అవమానపరిచారని.. ఆమె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. వారిని అరెస్ట్ చేయకుంటే జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకుపోతామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని గిరిజన సంఘాల నాయకులు తెలిపారు. రేపటి నుంచి కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసనకు పిలునిచ్చారు.

తీవ్ర స్థాయిలో గొడవ: నెల్లూరు కార్పోరేషన్ సమావేశంలో నిన్న పక్కా ప్రణాళిక ప్రకారం గొడవ సృష్టించారు. నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ వైపు చేరడంతో కార్పోరేషన్ లోని వైసీపీలో రెండు వర్గాలు మారారు. గత సమావేశంలోనే మేయర్ ని లక్ష్యంగా చేసుకుని మాట్లాడారు. నిన్న జరిగిన సమావేశంలో ప్రారంభంలోనే ముఖ్యమంత్రి జగన్ ఫోటో ఎవరు పెట్టారని మేయర్ ప్రశ్నించినందుకు తీవ్ర స్థాయిలో గొడవ జరిగింది. మేయర్ వర్గానికి, మరో వర్గానికి మధ్య తీవ్ర స్దాయిలో వివాదం జరిగింది. నిన్న జరిగిన గొడవలో మేయర్ ని నెట్టడం జరిగింది. ఈ గొడవలో మేయర్ స్రవంతి చీర లాగారని , అవమాన పరిచారని ముగ్గురు కార్పోరేటర్లపై పోలీస్ కేసు పెట్టారు. నేడు ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి కేసు అంశమై కలిశారు. కార్పొరేటర్లు మొయిల్ల గౌరీ, మూలే విజయభాస్కర్ రెడ్డి, బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ని అరెస్ట్ చేయాలని ఈ రోజు డిమాండ్ చేశారు. ఎస్పీ కార్యాలయం ముందు ర్యాలీగా వెళ్లి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జాతీయ ఎస్టీ కమిషన్ దృష్టికితీసుకుపోతానని మేయర్ స్రవంతి చెప్పారు. గిరిజన సంఘాల నేతలు మద్దతు తెలిపారు.

'గిరిజన మహిళా మేయర్ పై అనుచితంగా వ్యవహరించారు. పోలీసులు, అధికారులు ఘటనపై స్పందించకపోతే.. జాతీయ ఎస్టీ కమిషన్​కు ఫిర్యాదు చేస్తాం. ఇదే అంశంపై సుప్రీం కోర్టు వరకైనా వెళ్తాం. సీఎం ఫోటో ఎప్పుడు పెట్టారని అడిగినంత మాత్రమే దాడి చేస్తారా.మేయర్ ఛాంబర్ లో కూడా సీఎం ఫోటో ఉందని తెలిపారు. కేవలం ఫోటో సాకుతో దాడికి దిగారు. భయబ్రాంతులకు గురిచేయడం కోసమే దాడులు చేస్తున్నారు.'- పెంచలయ్య గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

గిరిజన మహిళా మేయర్ పై దాడి హేయమైన చర్య అని పలువురు గిరిజన, రాజకీయ నాయకులు ఖండించారు. సమస్యలపై చర్చించే ధైర్యం లేక దళితులు, గిరిజనులపై దాడులకు దిగుతున్నారని అన్నారని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై రేపు కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నాకు గిరిజన నాయకులు పిలుపునిచ్చారు.

ఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డిని కలిసిన మేయర్ స్రవంతి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.