ETV Bharat / state

అనధికారికంగా వేలం కేంద్రం మూసివేత.. పొగాకు రైతుల ఆవేదన

author img

By

Published : Apr 23, 2021, 12:09 PM IST

దేవుడు వరమించినా.. పూజారి కరుణించలేదు.. అన్న చందంగా మారింది నెల్లూరు జిల్లా పొగాకు రైతుల పరిస్ధితి. ఎలాటి ప్రకటన లేకుండానే అధికారులు.. పొగాకు వేలం కేంద్రాన్ని మూసివేశారు. దీనిపై రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు పడి.. నాణ్యమైన పంటను పండిస్తే.. గిట్టుబాటు ధర కల్పించకపోవటంతో.. నష్టాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

tobacco farmers are worried
tobacco farmers are worried

నెల్లూరు జిల్లాలో పొగాకు రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ఏడాది బాగా వర్షాలు పడడంతో నాణ్యమైన పొగాకును పండించారు. గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చేపట్టారు. మర్రిపాడు మండలం డీసీ పల్లి ప్లాట్ఫారంలో గిట్టుబాటు ధర లేక రైతులు కొన్ని రోజుల క్రితం ఆందోళన చేశారు. ఈ విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లటంతో.. పొగాకు బోర్డు రీజినల్ మేనేజర్ డి.వేణుగోపాల్.. వేలం కేంద్రాన్ని సందర్శించారు. వేలం నిర్వహణాధికారి రాజశేఖర్​తో కలిసి ఆయన పొగాకు రైతులతో చర్చలు జరిపారు. చర్చలు విఫలం కావటంతో.. గిట్టుబాటు ధర కల్పించి.. తమకు న్యాయం జరిగే వరకు వేలం నిర్వహించడానికి వీలులేదని డిమాండ్ చేశారు. దీంతో అధికారులు పొగాకు వేలం నిలిపివేశారు. దీనిపై అధికారికంగా.. బోర్డు అధికారులు ఎలాంటి ప్రకటన చేయలేదని.. కష్టపడి సాగు చేసే రైతుకు అధికారుల తీరుతో చివరకు నష్టాలే మిగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ చూడండి…

దుండగుల దాడిలో ఒకరు మృతి, మరొకరికి గాయలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.