ETV Bharat / state

అతిచిన్న రాకెట్ ఎస్ఎస్ఎల్​వీ పరీక్ష విజయవంతం

author img

By

Published : Mar 14, 2022, 6:38 PM IST

శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్​లో ఇవాళ నిర్వహించిన అతిచిన్న ఎస్ఎస్ఎల్​వీ (Small Satellite Launch Vehicle) రాకెట్ పరీక్ష విజయవంతమైంది. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పర్యవేక్షణలో రాకెట్​కు భూస్థిర పరీక్ష నిర్వహించారు.

అతిచిన్న రాకెట్ ఎస్ఎస్ఎల్​వీ పరీక్ష విజయవతం
అతిచిన్న రాకెట్ ఎస్ఎస్ఎల్​వీ పరీక్ష విజయవతం

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్​లో ఇవాళ నిర్వహించిన అతిచిన్న రాకెట్ పరీక్ష విజయవంతమైంది. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ పర్యవేక్షణలో ఎస్ఎస్ఎల్​వీ (Small Satellite Launch Vehicle) రాకెట్​కు భూస్థిర పరీక్ష నిర్వహించారు. భారత అంతరిక్ష వాణిజ్య రంగంలో ఇస్రో చౌకగా విదేశీ ఉపగ్రహాలను కక్ష్యలోకి చేరవేస్తోంది.

చిన్న ఉప గ్రహాలను చిన్న రాకెట్లతో ఉపయోస్తే ఖర్చు తగ్గే అవకాశం ఉందని ఇస్రో ఎస్ఎస్ఎల్​వీకి రూపకల్పన చేసింది. 500 కిలోల బరువు ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశ పెట్టేలా దీన్ని తయారు చేశారు. పీఎస్ఎల్వీ రాకెట్ తయారీలో పది శాతం ఖర్చుతో మూడు ఘన ఇంధన మోటర్లతో ఎస్ఎస్ఎల్​వీని రూపొందించారు.

ఇదీ చదవండి

కల్తీసారా విక్రేతలు వైకాపా నాయకులే.. మృతుల కుటుంబాలకు కోటి పరిహారం ఇవ్వాలి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.