ETV Bharat / state

సిద్ధేశ్వరకోనలోని జలపాతంలో గల్లంతైన విద్యార్థి మృతి..

author img

By

Published : Nov 19, 2022, 7:19 PM IST

Dead Body In Waterfall: సరదాగా జలపాతం వద్దకు వెళ్లి ఈత కొడుతుండగా ఒకరు గల్లంతయ్యారు. అతని మృతదేహం మరుసటి రోజు దొరికింది. ఈ ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది.

Dead Body In Waterfall
జలపాతంలో గల్లంతై విద్యార్థి మృతి

Student Dead Body: నెల్లూరు జిల్లా రాపూరులో విహార యాత్ర విషాదాన్ని మిగిల్చింది. మిత్రులందరూ కలిసి విహారయాత్రకు జలపాతం వద్దకు వెళ్లగా.. అందులో ఒక యువకుడు జలపాతంలో గత్లంతై మృతిచెందాడు. రాపూరు ఘాట్ రోడ్డు సిద్ధేశ్వరకోనలోని జలపాతంలో ఈ ఘటన జరిగింది. గూడూరుకు చెందిన ఆరుగురు ఇంజనీరింగ్​ విద్యార్థులు శుక్రవారం జలపాతం వద్దకు వెళ్లారు. జలపాతంలో దిగి ఈత కొడుతుండగా వెంకట కల్యాణ్​ అనే విద్యార్థి గల్లంతయ్యాడు. దీంతో విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థాలానికి చేరుకున్న పోలీసులు విద్యార్థి ఆచూకి కోసం గాలించారు. అచూకీ లభించకపోవటంతో మరుసటి రోజూ గాలింపు చర్యలు చేపట్టగా మృతదేహం లభ్యమైంది. ఈ జలపాతం వద్ద గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.