ETV Bharat / state

చదువుల రారాణి అనూష.. 'క్లౌడ్‌ బేస్‌ టెక్నాలజీలో రీసెర్చ్‌ చేయడమే నా లక్ష్యం'

author img

By

Published : May 23, 2022, 2:13 PM IST

ఆ అమ్మాయి.. చిన్నప్పటి నుంచే చదువులో ముందుండేది. కుమార్తె ప్రతిభను గమనించిన తల్లిదండ్రులు ప్రోత్సహించారు. అన్ని తరగతుల్లోనూ ప్రథమ స్థానంలో నిలిచిన ఆ విద్యార్థిని.. ఇంజినీరింగ్‌లోనూ యూనివర్శిటీ టాపర్‌గా నిలిచింది. గవర్నర్‌ నుంచి రెండు బంగారు పతకాలు కూడా తీసుకుంది నెల్లూరు జిల్లాకు చెందిన చదువుల తల్లి అనూష.

gold medal winner anush story
చదువుల రారాణి అనూష

'క్లౌడ్‌ బేస్‌ టెక్నాలజీలో రీసెర్చ్‌ చేయడమే నా లక్ష్యం'

నెల్లూరు జిల్లా చిన్న బజారుకు చెందిన తులసీ మధుసూదన్‌, లక్ష్మీకుమారి దంపతులది సాధారణ మధ్య తరగతి కుటుంబం. స్థానికంగానే చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని నడిపేవారు మధుసూదన్‌. వీరి కుమార్తె అనూష చిన్నతనం నుంచే చదువులో చురుగ్గా ఉండేది. కుమార్తె చురుకుదనాన్ని చూసిన తల్లిదండ్రులు.. అదే రీతిలో ప్రోత్సహించారు. మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదివిన పాఠశాల, కళాశాలల్లో టాపర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఎంసెట్‌లో రాష్ట్రస్థాయిలో 658వ ర్యాంకు సాధించింది. అనంతపురం జేఎన్​టీయూలో ఈసీఈ బ్రాంచ్‌లో సీటు సాధించింది.

ఇంజినీరింగ్‌లోనూ మంచి ప్రతిభ కనబరుస్తూ అందరి ప్రశంసలు అందుకున్న అనూష.. ఈసీఈ బ్రాంచ్‌లో టాపర్‌గా నిలిచింది. బెస్ట్‌ అవుట్‌ గోయింగ్‌ విద్యార్థినిగా ఎంపికైంది. ఈ రెండింటికిగాను ఇటీవల జరిగిన వర్శిటీ స్నాతకోత్సవంలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ చేతుల మీదుగా రెండు బంగారు పతకాలు అందుకుంది. అంతేకాకుండా టెక్సాస్‌ యూనివర్శిటీ నిర్వహించిన ఇన్నోవేషన్‌ ఛాలెంజ్‌లో క్వార్టర్‌ ఫైనల్‌ వరకు వెళ్లింది.

కుమార్తె సాధించిన విజయాలు చూసి సంతోషం వ్యక్తంచేస్తున్నారు తల్లిదండ్రులు. తమ కుమార్తె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నట్లు ఆ తల్లిదండ్రులు చెబుతున్నారు. విశ్వవిద్యాలయ స్థాయిలో అనేక ప్రయోగాలు చేశానంటున్న అనూష.. క్లౌడ్‌బేస్‌ టెక్నాలజీలో రీసెర్చ్‌ చేయడమే తన భవిష్యత్‌ లక్ష్యమని చెబుతోంది. తల్లితండ్రుల ప్రోత్సాహంతో అదీ సాధిస్తానని విశ్వాసం వ్యక్తం చేస్తోంది.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.