ETV Bharat / state

నెల్లూరులో వృద్ధురాలిపై దాడి.. ఐదుగురిపై కేసు నమోదు

author img

By

Published : Nov 25, 2022, 7:58 PM IST

Attack on old woman: నెల్లూరు జిల్లాలో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవటం లేదని వృద్ధురాలు పోలీస్​ స్టేషన్​ ముందు వానలో నిల్చోని నిరసన తెలిపింది. తన స్థలాన్ని కబ్జా చేసి తనపైనే దాడికి దిగారని ఆ వృద్ధురాలు పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. మీడియాలో కథనాలు రాగా.. దాడికి దిగిన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Attack on old woman In Nellore
నెల్లూరులో వృద్ధురాలిపై దాడి

Attack on old woman In Nellore: నెల్లూరు జిల్లా చేజర్ల మండలం బిల్లుపాడు గ్రామానికి చెందిన వృద్ధురాలిపై దాడికి యత్నించిన ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేశామని సీఐ రవినాయక్ తెలిపారు. లక్ష్మమ్మ స్థలాన్ని కబ్జా చేయటానికి యత్నించి.. ఆమెపై దాడి చేసి గుడిసెను కూలదోసిన ఘటన ఈ నెల 18న జరిగింది. నిందితులపై చర్యలు తీసుకోవాలని 23న పోలీస్ స్టేషన్ ముందు వృద్ధురాలు నిరసన చేపట్టారు. ఈటీవీ భారత్​ కథనాలకు స్పందించిన సీఐ రవినాయక్ గ్రామానికి వెళ్లి పరిశీలించి నిందితులపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు.

ఇది జరిగింది: బిల్లుపాటి లక్ష్మమ్మ తన గుడిసెను వైసీపీ నాయకులు కూల్చివేశారని.. 12మంది తనపై దాడి చేశారంటూ ఈ నెల 18న పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 5 రోజులు గడిచినా న్యాయం జరగలేదంటూ.. వర్షంలో తడుస్తూనే బుధవారం 3 గంటల పాటు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట నిలబడి నిరసన తెలిపారు. కానీ ఆమె గోడును ఎవరూ వినలేదు. పట్టించుకున్న పాపాన పోలేదు. గృహనిర్మాణ పథకం కింద 40 ఏళ్ల క్రితమే.. బిల్లుపాడు ఎస్సీ కాలనీలో లక్ష్మమ్మకు ఇంటి స్థలం కేటాయించారు.

అక్కడే గుడిసె వేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఇటీవల వైద్యం కోసం ఊరు విడిచి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన స్థానిక వైసీపీ నాయకులు.. అధికారుల సాయంతో వృద్ధురాలికి చెందిన 3 సెంట్ల స్థలాన్ని బిల్లుపాటి రాజేశ్వరి అనే మరో మహిళకు రాయించేశారు. వైద్యం చేయించుకుని తిరిగొచ్చిన లక్ష్మమ్మ.. తమ స్థలాన్ని వేరొకరికి ఎలా ఇస్తారంటూ అధికారులను ప్రశ్నించారు. స్థలం ఖాళీ చేయన్నందుకు వైసీపీ నాయకులు తనపై దాడి చేసి, గుడిసెను ధ్వంసం చేశారని లక్ష్మమ్మ వాపోయారు.

వృద్ధురాలిపై దాడికి యత్నించిన ఐదుగురు నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.