ETV Bharat / state

Nellore Politics: అనిల్ వర్సెస్ ఆనం.. ముదిరిన నెల్లూరు రాజకీయాలు...

author img

By

Published : Jun 25, 2023, 7:41 PM IST

Updated : Jun 25, 2023, 7:47 PM IST

MLA Anil Kumar Yadav Vs Anam cs
MLA Anil Kumar Yadav Vs Anam

YCP MLA Anil Kumar Yadav: నెల్లూరు రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. సీనియర్ నేత ఆనం రామనారాయణ రెడ్డి చేతిలో తాను ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని మాజీ మంత్రి అనీల్ యాదవ్ ప్రకటించారు. అనిల్ వ్యాఖ్యలపై ఆనం స్పందించారు. ఒక్క ఛాన్సు అంటూ అందికారంలోకి వచ్చిన జగన్, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని.. నెల్లూరు జిల్లా రాజకీయాలు కలుషితమయ్యాయంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Anam Ramanarayana Reddy Serious Comments: గత కొద్ది రోజులుగా నెల్లూరు రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. తాజాగా నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్, వైసీపీ బహిష్కృత నేత ఆనం రామనారాయణ రెడ్డి ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. నెల్లూరు నగరం నుంచి పోటీ చేస్తే ఆనం రామనారాయణ రెడ్డి రాజకీయ జీవితానికి ముగింపు పలుకుతానని అనిల్ కుమార్ యాదవ్ సవాలు విసిరాడు. తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరు పోటీ చేస్తారో స్పష్టత లేదని తెలిపిన ఆయన.. 2024 ఎన్నికల్లో ఆనం రామనారాయణరెడ్డికి నెల్లూరు నగరం నుంచి పోటీ చేసే దమ్ము ఉందా అంటూ అనిల్ కుమార్ సవాల్ విసిరారు. ఈ పోటీలో తాను ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ప్రకటించారు. కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్లు, లోకేశ్​ను పట్టుకుని తెలుగుదేశం నేతలు కలల కంటున్నారని అనిల్ కుమార్ ఎద్దేవా చేశాడు. వైసీపీ టికెట్​పై గెలిచి పదవికి రాజీనామా చేయకుండానే జగన్ ను దూషించటం అర్ధరహితమన్నారు.

లోకేశ్ పాదయాత్రకు వస్తున్న స్పందనను ఓర్చలేకే.. ఒక్క ఛాన్స్ అంటూ అధికారం చేపట్టి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మాజీమంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. లోకేశ్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే కొందరు తమ అక్కసు వెల్లగక్కుతున్నారని ఆయన నెల్లూరులో మండిపడ్డారు. పాదయాత్ర చూసి వణికిపోతు ఎం మాట్లాడాలో అర్దం కావడం లేదన్నారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లా రాజకీయాలు కలుషితమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. బూతుపురాణాలు వినలేక ప్రజలు అసహ్యించుకునే పరిస్థితి వచ్చిందన్నారు. మీ పార్టీ నేత ఇంటర్వూ ఇవ్వకపోతే, ఇక్కడకి వచ్చి ఎదోఎదో మాట్లాడటం సమంజసంకాదన్నారు. ప్రతిపక్షాలన్ని ఏకమై ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు నడుం బిగించాయని చెప్పారు.

తాను రాజీనామా చేసి మాట్లాడాలని అధికారపక్ష నేతలు అడగడం అర్ధరహితమన్నారు. ముగ్గురు తెలుగుదేశం పార్టీ శాససభ్యులను అధికార పార్టీ వైపు తిప్పుకున్న మీరు ముందు రాజీనామా చేయించి మాట్లాడాలని ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు తనను ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆనం ప్రకటించారు. ఒక వేళ తనకు సీటు ఇవ్వకుండా పది నియోజకవర్గాల గెలుపు బాధ్యత అప్పగించినా చేసేందుకు సిద్ధమేనని ఆనం పేర్కొన్నారు. రాజకీయాల నుంచి విరమించాలనుకున్నప్పడు నెల్లూరు నగరం నుంచి పోటీ చేసి తప్పుకోవాలన్న ఆలోచన ఉందని స్పష్టం చేశారు. లోకేశ్ పాదయాత్ర జిల్లా వదిలి మరో జిల్లాలో అడుగుపెట్టే లోపు నెల్లూరు జిల్లాలో అధికార పార్టీ కొట్టుకు పోవడం ఖాయమన్నారు. దోపిడి, అక్రమాలు, గంజాయి, మాదకద్రవ్యాలకు అడ్డాగా రాష్ట్రాన్ని మార్చేసారని ఆనం దుయ్యబట్టారు.

Anil Kumar Yadav: లోకేశ్ చేసేది పాదయాత్ర కాదు.. విహార యాత్ర: అనిల్ కుమార్

నెల్లూరులో అనిల్ వర్సెస్ ఆనం
Last Updated :Jun 25, 2023, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.