ETV Bharat / state

అధికారుల తీరుపై ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం.. ఎందుకంటే..!

author img

By

Published : Dec 23, 2022, 5:00 PM IST

MLA Kotamreddy fire on Officials: వైసీపీ ప్రభుత్వం మూడున్నరేళ్ల పాలన.. ప్రజలకు ఎంతవరకు లబ్ధి చేకూర్చిందోనని తెలుసుకునేందుకు.. నెల్లూరు జిల్లా ఎమ్మేల్యేలు, మంత్రులు, యంత్రాంగం జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.. అయితే ఈ సమావేశంలో ఊహించని విధంగా.. ఎమ్మెల్యేల నుంచి తీవ్ర అసహనం ఎదురైంది.. ముఖ్యంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.. అదేంటో చూద్దామా మరీ..!

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన.. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

MLA Kotamreddy fire on Officials: నెల్లూరు జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో అధికారుల తీరుపై రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టరేట్​లో జరిగిన ఈ సమావేశానికి మంత్రి కాకాణి, కలెక్టర్ చక్రధర్ బాబు, పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నాలుగేళ్లగా రూరల్ నియోజకవర్గంలో పనులేమీ జరగడం లేదని ఎమ్మెల్యే అసహనం వ్యక్తం చేశారు. సాక్ష్యాత్తూ ముఖ్యమంత్రి జగన్ మంజూరు చేసిన పనులకు సైతం అధికారులు ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వడం లేదన్నారు.

బారాషాహీద్ దర్గాలో రూ.15 కోట్ల నిధులతో ముఖ్యమంత్రి అభివృద్ధి పనులు మంజూరు చేస్తే, ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇవ్వలేదని తెలిపారు. బీసీ భవన్, అంబేద్కర్ భవన్, మైనార్టీ గురుకుల పాఠశాల పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిధులు లేవని అభివృద్ధి పనులు ఆపేసిన అధికారులు, కోటి రూపాయల వ్యయంతో నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ నివాసం నిర్మించడం ఏమిటని ప్రశ్నించారు.

వావిలేటిపాడు, అక్కచెరువుపాడు ప్రాంతాల్లోని జగనన్న కాలనీల్లో వసతులు మెరుగుపరచాలని ప్రతి సమావేశంలో అధికారులకు విన్నవిస్తున్నా.. కనీసం తట్టెడు మట్టి కూడా వేయలేదన్నారు. మంత్రులు, అధికారులు మారుతున్నా.. పనులు మాత్రం జరగడం లేదన్నారు. ఆర్థిక శాఖ కార్యదర్శి రావత్ కార్యాలయానికి వెళ్తే కనీసం మర్యాద కూడా ఇవ్వలేదని చెప్పారు. ఎక్కడ పనులు అక్కడ నిలిచిపోతే.. ప్రజలకు ఎవరు సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించకుంటే ఉద్యమ బాట తప్పదని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.