ETV Bharat / state

నివర్ తుఫాన్​పై మంత్రి అనిల్ సమీక్ష

author img

By

Published : Nov 25, 2020, 1:17 PM IST

minister review meeting on nivar cycolne
నివర్ తుఫాన్​పై మంత్రి అనిల్ సమీక్ష

నివర్ ప్రభావంతో నెల్లూరులో భారీ వర్షాలు కురుస్తుండటంతో...అధికారులతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమీక్ష నిర్వహించారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు.


నివర్ తుఫాన్ నేపథ్యంలో... తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలపై ఇరిగేషన్, కార్పొరేషన్ అధికారులతో జలవనరుల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమీక్షించి నిర్వహించారు. నెల్లూరు నగరంలోని ఇస్కాన్ సిటీ దగ్గర మంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ సమీక్ష జరిగింది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. చెరువు, వాగుల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అధికారులందరూ సమన్వయంతో విధులు నిర్వర్తించాలని కోరారు.

ఇదీ చదవండి: 'జగనన్న రోడ్డు గుంతలు - నడ్డి విరుగుడు' అంటూ నిరసన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.