ETV Bharat / state

జీవితాలతో ఆటలాడుతున్న ఐపీఎల్‌!

author img

By

Published : Oct 1, 2020, 5:01 PM IST

దేశ ప్రజల్లో ఎక్కవ మందికి వినోదాన్ని అందించే ఆట క్రికెట్. అందలోను ఐపీఎల్ కి ఉన్న క్రేజ్ చాలా ఎక్కవ . కాని దిన్నే కోందరు బెట్టింగ్‌ ల పేర్లతో సోమ్ము చేసుకుంటున్నారు. వీటికి సామాన్యులెందరో బలౌతున్నారు. కష్ట పడకుండానే అడ్డ దారుల్లో డబ్బు సంపాదించాలనే వ్యామోహంతో... బెట్టింగ్ పెట్టి అప్పుల పాలౌతున్నారు. వస్తువులను తాకట్టు పెట్టి కోందరు..అప్పులు చేసి మరికోందరు ఈ ఊబ్బిలో చిక్కుకుంటున్నారు. కోట్ల రూపాయలు చేతులు మారుతున్న ఈ ఆటలో సామాన్యుడు అప్పుల్లో కూరుకుపోతున్నారు.

క్రికెట్‌ బెట్టింగ్‌
ipl betting

2018లో క్రికెట్‌ బెట్టింగ్‌పై విస్తుబోయే నిజాలు వెలుగు చూశాయి. అప్పటి ఎస్పీ రామకృష్ణ ప్రత్యేక దృష్టి సారించి.. ఏళ్లుగా సాగుతున్న దందా గుట్టురట్టు చేశారు. అప్పట్లో అంతర్జాతీయ స్థాయి ఓ ప్రధాన బుకీ, 15 బుకీలు, 40 సబ్‌ బుకీలు, 439 మంది జూదరులను అరెస్టు చేశారు. ఆ ఏడాది సుమారు బెట్టింగ్‌ 85 కేసులు నమోదు చేశారు. ఈ దందాతో పరోక్షంగా సంబంధమున్న డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలను వీఆర్‌కు పంపి.. పోలీసు శాఖలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు.

నెల్లూరు నగరం స్టోన్‌హౌస్‌పేటకు చెందిన ఓ యువకుడిది రెక్కాడితేకాని డొక్కాడని కుటుంబం. అతను రెండ్రోజుల కిందట జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో ఓ జట్టు తరఫున రూ.10 వేలు బెట్టింగ్‌ కాశారు. ఆ జట్టు ఓడిపోవడంతో.. అప్పుచేసి మరీ ఆ నగదును చెల్లించాల్సి వచ్చింది.

ఐపీఎల్‌-13లో ఇప్పటికే మూడు మ్యాచ్‌ల్లో ఆయా జట్లు 200కు పైగా లక్ష్యాన్ని నిర్దేశించాయి. ఛేదనలో ప్రత్యర్థి జట్టు విఫలమవుతుందంటూ రూపాయికి పది రూపాయలు చొప్పున పెద్ద మొత్తంలో బెట్టింగ్‌లు కాశారు. కిసాన్‌నగర్‌కు చెందిన ఓ యువకుడు రూ.లక్షకు ఆశపడి.. రూ.10 వేలు బెట్టింగ్‌ కాసి.. ఆ మొత్తాన్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది.

ఐపీఎల్‌ కోలాహలం మొదలై పది రోజులు గడిచిపోయాయి. ప్రతి మ్యాచ్‌ ఉత్కంఠతో ఊపేస్తోంది. ప్రతి అభిమాని పొట్టి క్రికెట్‌లోని మజాను ఆస్వాదిస్తున్నారు. ఇదే క్రమంలో.. బెట్టింగూ మొదలైంది. గట్టుగా దందా సాగిపోతోంది. ఈ ఏడాది జిల్లాలో రూ.200 కోట్ల పందేరమే లక్ష్యంగా బుకీలు తమ కార్యకలాపాలు మొదలెట్టేశారు. ప్రతి బంతి.. ఓవరు.. ఇన్నింగ్స్‌.. మ్యాచ్‌ చొప్పున పందేలు కాస్తూ.. అమాయకుల జీవితాలతో ఆటలాడుతున్నారు. ప్రధానంగా యువతను ఉచ్చులో దింపుతున్నారు. వారికి రెట్టింపు నగదును ఆశగా చూపి.. భవిష్యత్తును ఛిన్నాభిన్నం చేస్తున్నారు.

అప్పుల్లో కూరుకుపోయి..

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో.. ఈసారి ఐపీఎప్‌-13 దుబాయ్‌ వేదికగా జరుగుతోంది. ప్రేక్షకులు లేకుండా తొలిసారిగా మ్యాచ్‌లు నిర్వహిస్తున్నారు. 2020 ఏడాదిలో టీ20 జరుగుతుండటం మరో ప్రత్యేకత. కొవిడ్‌ నేపథ్యంలో సుదీర్ఘ కాలం తరువాత మ్యాచ్‌లు నిర్వహిస్తుండటం బుకీలకు కలిస్తోంది. ఈ సంవత్సరం జిల్లాలో సుమారు రూ.200 కోట్లు లావాదేవీలు జరిగేలా.. ఓ అంతర్జాతీయ బుకీ పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రంతో పాటు పట్టణాలు, గ్రామాల్లోనూ బెట్టింగ్‌ విస్తరించడం ఆందోళన కలిగిస్తోంది. కొందరు యువకులు అత్యాశకు పోయి.. అప్పుల్లో కూరుకుపోతున్నారు. తల్లిదండ్రులు కాయకష్టం చేసి దాచుకున్న నగదును.. బుకీలకు అప్పగిస్తున్నారు. కొందరైతే తమ ద్విచక్ర వాహనాలను తాకట్టు పెట్టేసి డబ్బు చెల్లిస్తున్నారు.

ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం..

జిల్లాలో బెట్టింగ్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించం. ఇందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించాం. ఇప్పటికే బృందాలను ఏర్పాటు చేసి.. నిఘా ఉంచాం. ఎక్కడైనా క్రికెట్‌ బెట్టింగ్‌ జరుగుతుంటే.. తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. బుకీలు, నిర్వాహకులపై కఠినంగా వ్యవహరిస్తాం.

- భాస్కర్‌ భూషణ్‌, ఎస్పీ, నెల్లూరు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.