ETV Bharat / state

ఆకట్టుకుంటున్న సీఎం జగన్ సైకత శిల్పం

author img

By

Published : May 31, 2020, 10:23 AM IST

నెల్లూరు జిల్లా ఏరూరు సముద్రతీరంలో సీఎం జగన్ సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. వైకాపా పాలనకు ఏడాదైన సందర్భంగా ఈ శిల్పాన్ని రూపొందించానని శిల్పి సనత్ కుమార్ తెలిపారు.

impressive jagan sand art in erurur nellore district
ఆకట్టుకుంటోన్న సీఎం జగన్ సైకతశిల్పం

నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం ఏరూరు సముద్ర తీరంలో రూపొందించిన సీఎం జగన్ సైకత శిల్పం ఆకట్టుకుంటోంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ శిల్పాన్ని రూపొందించారు.

జగన్ అనే నేను ట్యాగ్​లైన్​ను శిల్పానికి పెట్టారు. "ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ.. పేదలకు అండగా నేనున్నానంటూ భరోసా ఇస్తున్న జగన్ పాలనకు గుర్తుగా ఈ సైకత శిల్పం రూపొందించా" అని శిల్పి మంచాల సనత్ కుమార్ తెలిపారు.

ఇదీ చదవండి:

'ఎస్​ఈసీ ఆర్డినెన్స్​ జారీలో లోపాలకు సీఎం సమాధానం చెప్పాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.