ETV Bharat / state

పెన్నా తీరంలో వైసీపీ నేతల దందా.. అక్రమంగా పంటలు సాగు.. ఆపై కోట్లలో లీజుకు

author img

By

Published : Dec 31, 2022, 3:22 PM IST

Illegally Cultivated Crops in Penna River Basin: నెల్లూరు జిల్లాలో పెన్నా నది తీరంలో యథేచ్ఛగా ఆక్రమణలు కొనసాగుతున్నాయి. నదీతీర ప్రాంతంలో బోర్లు తవ్వకూడదని వాల్టా చట్టం స్పష్టంగా చెబుతున్నా.. అక్రమంగా బోర్లు వేసి మరీ సాగు చేస్తున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. నదీ తీరాన్ని ఆక్రమించి సాగు చేయడమే కాకుండా లీజులకు కూడా ఇస్తున్నట్లు చెబుతున్నారు.

Penna River Basin
పెన్నా నది తీరం

Illegally Cultivated Crops in Penna River Basin: నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో పెన్నా నది పరీవాహక ప్రాంతం ఆక్రమణలకు గురవుతోంది. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు ఇక్కడ శెనగ పంట సాగు చేస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. నదీ తీర ప్రాంతంలో బోర్లు వేయడం నిషేధమని తెలిసినా.. ఇక్కడ దాదాపు 800 ఎకరాలు ఆక్రమించి సుమారు 30 బోర్లు వేసి సాగుచేస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు లీజులకు కూడా ఇస్తున్నారు. పైప్ లైన్లు ఏర్పాటు చేసుకుని బిందు సేద్యం ద్వారా పంటకు నీరు అందిస్తున్నారు. ఈ విషయాన్ని పెళ్లేరు గ్రామస్థులు జిల్లా కలెక్టర్‌కు, జాయింట్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

పెన్నా తీరంలో వైసీపీ నేతల దందా.. అక్రమంగా పంటలు సాగు.. ఆపై కోట్లలో లీజుకు

"దాదాపు 600 ఏకరాల నదీ పరివాహక ప్రాంతాన్ని చేజెర్ల మండలంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులు అంతా ఆ పొలాన్ని ఆక్రమించి.. ఆక్రమించిన పొలాన్ని నెలకు 20000 రూపాయల లెక్కన ఒక ఎకరాకు లీజుకిస్తున్నారు.. 600 ఎకరాలను కూడా లీజుకిచ్చి సుమారు 1 కోటి 20 లక్షలు కుంభకోణం జరుగుతుంది.. ఈ కుంభకోణంలో సదరు అధికారులు భాగస్వాములుగా ఉన్నారు.. ప్రభుత్వ అధికారులు ఆ భూమికి తగిన సదుపాయాలు చేస్తున్నారు.. బోర్లు ఏర్పాటుకు రెవెన్యూ అధికారులు అనుమతులు ఇచ్చారు .. బోర్లు కావలసిన విద్యుత్ కనెక్షన్​లను ఎలక్ట్రికల్​ డిపార్ట్​మెంట్​ వారు సహకరించారు." నందా ఓబులేసు అడ్వకేట్

చేజర్ల మండలంలోని పెళ్లేరు, రామతీర్ధం, మూముడూరు, డీకే పాడు, కోటితీర్ధం, నడిగడ్డ అగ్రహారం గ్రామాల వరకు ఇదే పరిస్థితి. నదీ తీర ప్రాంతాల్లో పంటలు వేసి లీజులకు ఇచ్చారు. ఆక్రమిత భూముల్లో పంట సాగుకు అధికారులు లైన్లు వేసి మరీ విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. బిందు సేద్యానికి కూడా అనుమతులు ఇచ్చారు. మోటార్లకు అనుమతులు ఎలా ఇస్తారని స్థానిక రైతులు ప్రశ్నిస్తున్నారు.. ఎస్సీ రైతులకు ఒక న్యాయం, వైసీపీ నాయకులకు మరో న్యాయమా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని బోర్లు, విద్యుత్ కనెక్షన్లు తొలగించాలని కోరుతున్నారు.

చేజెర్ల మండలం పెల్లేటు గ్రామం దగ్గర నదీ పరివాహక ప్రాంతం అంతా కూడా సుమారు వేల ఏకరాల భూమిని ఆక్రమించుకుని అన్యాక్రాంతం చేశారు.. కొమ్మి సిద్దులు నాయుడు ,సుదాకర్​ రెడ్డి అనే వైసీపీ నాయకులు ఎంతో భూమిని దోచుకుని..కోట్ల సొమ్మును కొల్లగొడుతున్నారు..మోటార్లు ఉన్నాయి, ట్రాన్స్​పార్మ్స్ ఉన్నాయి..అంతా ప్రభుత్వ భూమే అన్యాక్రాంతం అయ్యిపోయింది.. జానకీ బీఎస్పీ నేత

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.